Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునకు షాకిచ్చిన మోహన్ బాబు.. విష్ణు - రాజ్‌తరుణ్‌లతో 'గుండమ్మ కథ తీస్తారట!

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (14:56 IST)
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'ఈడోరకం ఆడోరకం' సక్సెస్ మీట్‌లో చేసిన సంచలన వ్యాఖ్యలు నాగార్జునకు షాక్ నిచ్చాయి. మెగా హీరోలపై ఇన్ డైరెక్ట్‌గా సెట్టైర్లు వేసిన మోహన్ బాబు... టాలీవుడ్ మన్మథుడిని సైతం వదిలిపెట్టలేదు. అక్కినేని నాగార్జున కలల ప్రాజెక్ట్ "గుండమ్మ కథ". ఈ సినిమాను ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాడు. అయితే సినిమాపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కన్నేశాడు. 
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాగ చైతన్యలు హీరోలుగా నాగార్జున అలనాటి ఆణిముత్యం "గుండమ్మ కథ" సినిమాను తెరకెక్కించాలని భావిస్తుంటే, రీమేక్ చిత్రంగా మంచు విష్ణు, రాజ్ తరుణ్‌ల కాంబినేషన్‌లో తీసే ఆలోచన చేస్తున్నాను అంటూ మోహన్ బాబు తన మనసులో మాట బయట పెట్టాడు.  విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఈడోరకం ఆడోరకం' హిట్ అయిన కారణంతో మోహన్ బాబుకి ఈ ఆలోచన వచ్చిందట. 
 
ఈ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ వీరిద్దరి కాంబినేషన్ చూశాక తనకు వీరిద్దరితో 'గుండమ్మ కథ' సినిమాను రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చిందని ఆ సినిమా హక్కులను కొనడానికి ప్రయత్నిస్తాను అంటూ అందరికీ ఒక షాక్ ఇచ్చాడు మోహన్ బాబు. అంతేకాదు ఈ రీమేక్‌ను కూడ నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలోని నిర్మిస్తాను అంటూ మరో షాక్ ఇచ్చాడు మోహన్ బాబు. 
 
ఈ ఫంక్షన్‌కు అతిథిగా విచ్చేసిన దాసరి మాట్లాడుతూ మరో షాక్ ఇచ్చాడు. హీరోల్ని కాకుండా కథల్ని నమ్మి సినిమాలు చేయాలి అని అంటూ 'ఈడోరకం ఆడోరకం' అలాంటి సినిమానే అని తెలిపారు. విష్ణు సక్సెస్ చూసి మోహన్ బాబు ఎంత సంతోషిస్తాడో నేను అంతే సంతోషిస్తాను అని పలుకుతూ సినిమాలు హిట్ అవుతున్నాయని హీరోలు రేట్లు పెంచేసి నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటూ దాసరి హితవచనాలు పలికారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు

నేటి నుంచి ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లో మార్పులు.. క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు...

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments