Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రేటుకైతే... నేను రెఢీ : మీరు సిద్ధమా.. నిర్మాతకు షాకిచ్చిన మిల్కీబ్యూటీ!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:31 IST)
టాలీవుడ్‌లో మిల్కీబ్యూటీగా ముద్ర వేయించుకున్న హీరోయిన్ తమన్నా. ఈమె బాలీవుడ్‌లో సైతం అడుగుపెట్టి ఒకటిరెండు చిత్రాల్లో నటించింది. మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసింది. దీంతో తన రేటు (రెమ్యునరేషన్)ను అమాంతం పెంచేసింది. ఇదే రేటును తనను సంప్రదించేందుకు వచ్చే దక్షిణాది నిర్మాతలకు చెపుతోంది. ఈ రేటు వినగానే చాలా మంది నిర్మాతలు పరుగు పెడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కోలీవుడ్‌లో చోటు చేసుకుంది. 
 
ప్రస్తుతం తమిళంలో ఎదుగుతున్న హీరో శివకార్తికేయన్ తాజాగా 'రజనీ మురుగన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకి మన మిల్కీ బ్యూటీని తీసుకోమని నిర్మాతకు సిఫారసు చేశాడట. హీరోగారు చెప్పారు కదా అని చెప్పి, అమ్మడిని వెళ్లి కలిస్తే, 'ప్రస్తుతం నేను బాలీవుడ్‌లో ఇంత తీసుకుంటున్నాను... మరి అంత ఇస్తే డేట్స్ ఇస్తా' అందట. 
 
ఆమె చెప్పిన ఫిగర్ విని ఆ నిర్మాత షాక్ తిని, ''మాది చిన్న సినిమా తల్లీ. అంత ఎక్కడ ఇచ్చుకోగలం?" అంటే, ''నా దృష్టిలో సినిమాల పరంగా చిన్నా, పెద్దా అనే భేదం లేదు సార్" అంటూ తమ్మూ చిలక పలుకులు పలకడంతో ఆ నిర్మాత మెల్లగా జారుకున్నాడట! నువ్వే కావాలి తల్లీ... అంటూ బతిమాలితే ఇలాగే ఉంటుంది కదా.!! 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments