Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

దేవీ
శనివారం, 22 నవంబరు 2025 (11:43 IST)
Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.
 
తాజా సమాచారం మేరకు, చాలా కాలం తర్వాత చిరంజీవి సినిమాలో శరత్ సక్సేనా విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. రాజకీయ ఉద్దండుడు పాత్రను ఆయన పోషిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీ నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారట. గత రెండురోజులుగా హైదరాబాద్ శివార్లో ఓ ప్రైవేట్ భవంతిలో లావిష్ గా చిత్రీకరిస్తున్నారు. ఆ సన్నివేశాల్లో కలెక్టర్లు, ఐ.ఎ.ఎస్. అధికారులు, రాజకీయ నాయకులు అంతా ఆనందోత్సవాలతో ఫంక్షన్ జరుగుతుందట.

ఆ సన్నివేశపరంగా మెగాస్టార్ ఓ అద్భుతమైన పాటను ఆలపిస్తారట. ఇది ఐటెం సాంగ్ కాదు. ప్రజలను చైతన్యవంతుల్ని చేసే సాంగ్ అట. అయితే ఆ సాంగ్  చిత్రీకరణ  చేశాక ఔట్ పుట్ చూశాక చిరంజీవికి నచ్చలేదట. వెంటనే ఈ సాంగ్ ను డిలీట్ చేయండని సూచించి షూటింగ్ కు ప్యాకప్ చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ కొంత గేప్ తీసుకుని మరోసారి చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
 
ఇప్పటికే మీసాల పిల్ల.. హిట్‌గా దూసుకెళ్తోంది. ఇంకా ఈ సినిమాలో మరిన్ని ప్రత్యేకతలు వుండబోతున్నాయి. గ్యాంగ్ లీడర్ తరహా లో వున్నట్లు తన ఆహార్యాన్ని మార్చుకునేలా దర్శకుడు అనిల్ రావిపూడి చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

బెట్టింగ్ యాప్స్ కేసు: నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖిల వద్ద విచారణ ఎలా జరిగింది?

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments