మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

దేవీ
బుధవారం, 20 ఆగస్టు 2025 (11:40 IST)
Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నాలుగు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో దర్శకుడు వశిష్ట్ చేస్తున్న విశ్వంభర రిలీజ్ కావాల్సి వుంది. ఈ ఏడాది సంక్రాంతికే అనుకుంటే సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. అప్పటినుంచి నేటి వరకూ వాయిదా పడుతూనే వుంది. మద్యలో రాముడుపై ఓ సాంగ్ ను కూడా చిత్రీకరించారు. ఇక మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతోంది. ఇప్పటికే సగం షూటింగ్ అయింది. దాని గురించి అప్ డేట్ ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజున వెల్లడిస్తున్నట్లు అనిల్ ఇప్పటికే తెలియజేశారు.
 
ఇంకోవైపు ఎప్పటినుంచో వాయిదా పడుతున్న విశ్వంభర చిత్రం గురించి కూడా ఆగస్టు 22నే కొత్త అప్ డేట్, రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల కానుంది. అదేవిధంగా ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావాల్సి వుంది. లెక్క ప్రకారం ఆగస్టు 22న ప్రారంభించాల్సి వుంది. కానీ సినీ కార్మికుల సమ్మెతో షెడ్యూల్ మొత్తం ఖకావికలం అయినట్లు తెలుస్తోంది. ఇంకా కొలిక్కి రాని కార్మికుల సమ్మె కళ్ళ ముందుండగా పెద్ద మనిషి తరహాలో సమస్యను పరిష్కరించే దిశలో మెగాస్టార్ భుజస్కందాలపై వుండడంతో కొత్త సినిమా ఓపెనింగ్ వాయిదా పడాల్సిన అవసరం వుందని తెలుస్తోంది.
 
ఇంకోవైపు దర్శకుడు బాబీ దర్శకత్వంలో మరో సినిమా కూడా ఓపెనింగ్ కావాల్సి వుంది. దానిని అక్టోబర్ లో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇదిలా వుండగా, కార్మికుల సమ్మెకు పరిష్కారం  కూడా ఆగస్టు 22నే ప్రకటించనున్నట్లు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈలోపు సమస్య పరిష్కారం అవుతుందని కొద్దిరోజులుగా ఫెడరేషన్ నాయకులు చెబుతున్నా, మళ్ళీ నిన్న కూడా సమ్మె చేయడంతో మెగాస్టార్ పుట్టినరోజున సినీ పెద్దలంతా కార్మికులకు ఫేవర్ గా ప్రకటన వెలువరించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments