Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు మహేష్ బాబుతోనే చేయాలివుంది.. సీనియర్ నటి మీనా

Webdunia
శనివారం, 21 మే 2016 (16:01 IST)
తెలుగు .. తమిళ భాషల్లో అగ్రనటిగా ఒకప్పుడు వెలుగొందిన నటి మీనా. ఈ రెండు భాషలలోను అగ్రకథానాయకులతో కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్న చేప కళ్ల మీనా, ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగాను మారడానికి ఆమె రంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి తెలుగు.. తమిళ భాషల్లో సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో పడిందట.
 
ఇప్పటికే తమిళ తెలుగు ఇండస్ట్రీలకు సంబంధించిన హీరోలను సంప్రదించినట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే తెలుగులో మహేష్‌తో ఓ పెద్ద సినిమా తీసే ఆలోచనలో ఉందట. తాజాగా ఈమె మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రొడక్షన్ కంపెనీ పెట్టి కమల్ హాసన్, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్లతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అంటూ ప్రకటించింది. 
 
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించిన 'బ్రహ్మోత్సవం' విడుదలై సూపర్ హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ తదుపరి చిత్రం ఎవరితో చేస్తారని సినీవర్గాలతో పాటు ఇటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజా సమాచారం ఏంటంటే  తమిళ క్రేజీ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సామజిక నేపథ్యంలో సాగే చిత్రం చేయడానికి ప్రిన్స్ రెడీ అవుతున్నాడట. 
 
ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పూరి జగన్నాథ్‌లతో ప్రాజె‌క్ట్ చేయడానికి మహేష్ పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నాడు. కమల్ కూడా శభాష్ నాయుడు సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా మరో రెండు సినిమాలను వరుసగా లైన్‌లో పెట్టుకున్నాడు. మరి మీనా ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయ్యేవరకు వేచియుంటుందో లేక వేరే హీరోలతో నిర్మాణం మొదలెడుతుందో చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments