Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నా.. బిజెపిలోకి వెళతా...?

సినీ ప్రముఖులు రాజకీయ బాట పడుతున్నారు. ఇప్పటికే వారసత్వ రాజకీయాలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తండ్రి గాని, తల్లి గాని, బంధువులు గానీ ఎవరైనా రాజకీయాల్లో ఉంటే వెంటనే వారి వెంట వారి కుమారులు, కుమార్తెలు నడుస్తున్నారు. అదే బాటలో సినీ నటుడు, కలెక్షన్ క

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (15:58 IST)
సినీ ప్రముఖులు రాజకీయ బాట పడుతున్నారు. ఇప్పటికే వారసత్వ రాజకీయాలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తండ్రి గాని, తల్లి గాని, బంధువులు గానీ ఎవరైనా రాజకీయాల్లో ఉంటే వెంటనే వారి వెంట వారి కుమారులు, కుమార్తెలు నడుస్తున్నారు. అదే బాటలో సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు కుమార్తె మంచులక్ష్మి కూడా నడుస్తోంది. వైసిపిలోకి వెళ్ళాలని ముందు మంచులక్ష్మి నిర్ణయించుకున్నా, చంద్రగిరి టిక్కెట్ కోసం తండ్రి నుంచి జగన్మోహన్ రెడ్డికి చెప్పించుకున్నా ఆ తరువాత వెనక్కి తగ్గారు. స్థానిక పార్టీల కన్నా జాతీయ పార్టీలే ఉత్తమమని భావించిన మంచులక్ష్మి బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇదే విషయాన్ని తన తండ్రికి కూడా తెలిపారట మంచులక్ష్మి. తాను బిజెపిలోకి వెళతానని చెప్పారట. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దక్షిణ రాష్ట్రాల వైపు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న తరుణంలో మంచులక్ష్మి లాంటి సినీ ప్రముఖులు ఆ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందనేది ఆ పార్టీ నేతల భావన. అందులోను మోహన్ బాబు లాంటి ప్రముఖ వ్యక్తి కుమార్తె మంచులక్ష్మి కావడం బిజెపికి కలిసొచ్చే అంశమే. అందుకే మంచులక్ష్మిని ఆ పార్టీలోకి తీసుకునేందుకు బిజెపి నేతలు కూడా సిద్ధంగా ఉన్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments