నేను రహస్యంగా పెళ్ళి చేసుకున్నానా? అంత సీన్ లేదమ్మా: మల్లికా షెరావత్
మర్డర్, హిస్, దశావతారం వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నాయకి మల్లికా షెరావత్.. కేవలం బాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా ఇంగ్లీష్, చైనీస్ చిత్రాల్లో కూడా నటించారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట
మర్డర్, హిస్, దశావతారం వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నాయకి మల్లికా షెరావత్.. కేవలం బాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా ఇంగ్లీష్, చైనీస్ చిత్రాల్లో కూడా నటించారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టిన మల్లికా షెరావత్ తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోందని.. ఆమెకు రహస్యంగా వివాహం కూడా అయిపోయిందంటూ ఓ ఇంగ్లీష్ పత్రిక రాసింది.
దీనిపై మల్లికా షెరావత్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. తనకు పెళ్ళి కాలేదని.. అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేశారు. 'దయ చేసి పుకార్లను ఆపండి. నేను రహస్య వివాహం చేసుకోలేదు. నా గురించి అసత్య వార్తలను ప్రచారం చేయడం తగదు' అని ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ వార్తలకు డీఎన్ఏ ఇండియా అనే పేపర్ మాత్రమే బాధ్యత వహించాలని మల్లికా షెరావత్ తెలిపింది. అనవసరంగా అసత్యపు వదంతులను ప్రచారం చేయవద్దని మల్లికా షెరావత్ విజ్ఞప్తి చేశారు.