Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్రీమంతుడు' మహేష్‌ బాబును రాజకీయాల్లోకి లాగిన కొరటాల శివ... 2017లో సీఎంగా...

తెలుగుతెరపై బాలనటుడిగా అడుగుపెట్టిన మహేష్‌బాబు ఓ వయసు తర్వాత ప్రిన్స్‌గా తెరంగేట్రం చేసి యువ కథానాయకుల్లో అగ్రస్థానంలో నిలిచారు. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న మహేష్ కార్పోరేట్ సంస్థల హీరోగా

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (16:26 IST)
తెలుగుతెరపై బాలనటుడిగా అడుగుపెట్టిన మహేష్‌బాబు ఓ వయసు తర్వాత ప్రిన్స్‌గా తెరంగేట్రం చేసి యువ కథానాయకుల్లో అగ్రస్థానంలో నిలిచారు. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న మహేష్ కార్పోరేట్ సంస్థల హీరోగా తెలుగులో ఎవరూ సాధించని క్రేజ్‌ను సంపాదించారు. దీంతో క్రేజ్ ఉన్న హీరోగా మహేష్‌ను రాజకీయాల్లోకి సైతం లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అసలు విషయం ఏంటంటే... మహేష్‌ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 'బ్రహ్మోత్సవం' సినిమా తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంటున్నాడు. 
 
ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ‌గా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కే మొగ్గు చూపుతూ వ‌స్తోన్న మ‌హేష్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేష్ - మురుగదాస్‌ కాంబినేష‌న్‌లో సినిమా పూర్తయ్యాక ''శ్రీమంతుడు'' కాంబోలో సినిమా మొదలవుతుంది. ఈ కథా నేపథ్యం రాజకీయాల చుట్టూ తిరగబోతోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఈ చిత్రంలో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ''దూకుడు''లో మహేష్‌ ఎమ్‌.ఎల్‌.ఏ పాత్రలో కనిపించాడు కదా? ఇప్పుడు సీఎమ్‌గా ప్రమోషన్‌ వచ్చిందన్నమాట. 2017 జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్టుని తీర్చిదిద్దే పనిలో ఉన్నారని సినీ పండితులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments