Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన రికార్డులను తానే తిరగరాసుకుంటున్న ప్రిన్స్, ఎలా?

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (20:52 IST)
కమర్షియల్ ప్రకటనల విషయంలో సినీ నటుడు మహేష్ బాబు జోరు కొనసాగిస్తున్నారు. డైనమిక్ హీరో మహేష్ బాబుతో ప్రమోట్ చేయించుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఫలితంగా ప్రకటన రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లేదంటున్నారు ప్రిన్స్ మహేష్. 

 
అయితే మహేష్ అడిగినంత డబ్బులు ఇచ్చేందుకు కంపెనీలు కూడా తగ్గేదిలేదంటున్నాయట. మహేష్‌ బాబు ఇప్పటికే దాదాపు డజనుకు పైగా బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో ఒక్కోదానికి ఒక్కోలా పారితోషికం తీసుకుంటూ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటున్నాడట.

 
తాజాగా ఓ శీతలపానీయం యాడ్ కోసం భారీగా పారితోషికం అందుకున్నాడట. ఈ యాడ్‌ను దుబాయ్ లోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతంలో షూట్ చేశారట. హిందీలో ఈ యాడ్‌ను హృతిక్ రోషన్ చేశారట. తెలుగులో యేడాది పాటు ఈ సాఫ్ట్ డ్రింక్‌ను ప్రమోట్ చేయడానికి మహేష్ ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.

 
గత యేడాది కూడా ఈ బ్రాండ్‌ను మహేష్ ప్రమోట్ చేశారట. అయితే అప్పట్లో 7 కోట్లు తీసుకున్న మహేష్ ఈసారి అదనంగా మరో ఐదుకోట్లు ఎక్కువగా తీసుకున్నారట. అయితే సోషల్ మీడియాలో కూడా ఈ కంపెనీకి సంబంధించిన బ్రాండ్‌ను మహేష్  ప్రమోట్ చేయాల్సి ఉంటుందట.
 
ఈ మొత్తానికి భారీగా రెమ్యునరేషన్ అడిగినట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రమోషన్స్ మరోవైపు సినిమాల్లో మహేష్ బిజీబిజీగా ఉన్నారు. సర్కార్ వారి పాట సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నారు మహేష్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

బీఆర్ఎస్ బాగా రిచ్ గురూ.. ఆ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు.. వామ్మో! (video)

కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

జగన్మోహన్ రెడ్డి హౌజ్‌కు వస్తే మీ తాట తీస్తారని భయమా?: దువ్వాడ శ్రీనివాస్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments