Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారతం.. రాజమౌళి సినిమాలో అమీర్ ఖాన్ కృష్ణుడైతే.. మహేష్ బాబు..?

మహాభారతం.. రాజమౌళి కళల ప్రాజెక్టు. బాహుబలి అనుభవంతో రాజమౌళి మ‌హాభార‌తం తీస్తాడ‌నుకుంటే త‌న‌కు ఈ అనుభ‌వం స‌రిపోద‌ని జక్కన్న అంటున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మహాభారతం మీద ఆసక్తి ప్

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (10:08 IST)
మహాభారతం.. రాజమౌళి కళల ప్రాజెక్టు. బాహుబలి అనుభవంతో రాజమౌళి మ‌హాభార‌తం తీస్తాడ‌నుకుంటే త‌న‌కు ఈ అనుభ‌వం స‌రిపోద‌ని జక్కన్న అంటున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మహాభారతం మీద ఆసక్తి ప్రదర్శిస్తుండటం.. కృష్ణుడి పాత్ర చేయాలని ఉందని కూడా ప్రకటించడంతో రాజమౌళి ఇటీవలే అతడిని కలిసి ఈ సినిమా గురించి చర్చించాడట. స్వయంగా రాజమౌళే ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను ఇటీవ‌ల అమీర్‌ఖాన్‌ను క‌లిసి మ‌హాభార‌తం గురించి చ‌ర్చించాన‌ని… మహాభారతంలో నటించడానికి అమీర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడ‌ని రాజమౌళి తెలిపాడు.
 
ఇదిలా ఉంటే.. దుబాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి బీఆర్ శెట్టి నిర్మాతగా రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న 'మహాభారతం' చిత్రంలో శ్రీకృష్ణుడిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్నాడని వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మహేష్ బాబే శ్రీకృష్ణుడని, చిత్ర నిర్మాతలు ఆయన్ను సంప్రదించారని వచ్చిన వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 
 
దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు మహేష్ మేనేజర్‌ను వివరణ కోరగా, ఆయన ఈ వార్త పుకారేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' చిత్రంతో మహేష్ బిజీగా ఉన్నారని, ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తారని చెప్పారు. మహాభారతంలో మహేష్ బాబు నటించట్లేదని, అసలా ప్రతిపాదనే మహేష్ దగ్గరికి రాలేదని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments