Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ 23 సినిమా టైటిల్ స్పైడర్..? ఉగాదికి ఫస్ట్ లుక్.. మే-28న ఆడియో.. జూన్ 23న సినిమా..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ కాంబోలో వస్తున్న సినిమా ఆడియో రిలీజ్ మే 28వ తేదీ జరుగనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిన

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (13:04 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ కాంబోలో వస్తున్న సినిమా ఆడియో రిలీజ్ మే 28వ తేదీ జరుగనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మహేష్ బాబు స్టైలిష్ పోలీస్ ఆఫీసరుగా కనిపిస్తారు.

హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. దర్శకుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. హరీష్ జై రాజ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో మే 28 తేదీన విడుదల కానుందని, సినిమా జూన్ 23వ తేదీన రిలీజ్ కానుంది.  
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వియత్నాంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా పనులన్నీ పూర్తయినట్లే. దీంతో ఉగాదిన ఫస్ట్‌లుక్‌ విడుదల చేసే అవకాశాలున్నాయి. ఆ రోజే టైటిల్‌ ఏంటో తేల్చేశారు. ఈ సినిమాకు ‘ఏజెంట్‌ శివ’, ‘సంభవామి’ అనే టైటిళ్లు రేసులో ఉన్నాయి. ప్రస్తుతం ‘స్పైడర్‌’ అనే మరో టైటిల్‌ ప్రచారంలో ఉంది.

‘స్పైడర్‌’కే చిత్రబృందం మొగ్గుచూపే అవకాశాలున్నాయని.. ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు స్పైడర్ అనే టైటిల్ సరిపోతుందని సినీ పండితులు అంటున్నారు. మరి మురుగదాస్ ఏ టైటిల్ ఖరారు చేస్తారో తెలియాలంటే.. ఉగాది దాకా వెయిట్ చేయాల్సిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments