Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకులు గొప్పవారు.. నేను ఎప్పటికీ బుర్రలేని వాడినే : కీరవాణి ట్వీట్స్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తన కెరీర్‌, ప్రస్తుత సినీ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలపై ఇటీవల ట్విటర్‌ వేదికగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆయన కొన్ని ఘాటైన ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (09:49 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తన కెరీర్‌, ప్రస్తుత సినీ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలపై ఇటీవల ట్విటర్‌ వేదికగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆయన కొన్ని ఘాటైన ట్వీట్లతో విరుచుకుపడ్డారు. సోమవారం మరోసారి వరుస ట్వీట్లు చేశారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సలహా మేరకు గతంలో చేసిన ట్వీట్లను డిలీట్ చేసినట్టు వెల్లడించారు. అంతేకాకుండా, తాజాగా కీరవాణి చేసిన ట్వీట్లపై ఓ లుక్కేస్తే... 
 
నేను చేసిన ట్వీట్లు చాలామందిని బాధించాయి. తమ్మారెడ్డి భరద్వాజ వంటి పెద్దల సూచన మేరకు వాటిని డిలీట్‌ చేశాను. మేమందరం ఎప్పటికీ విద్యార్థులమే. తప్పులు చేస్తుంటాం. తమ్మారెడ్డి భరద్వాజలాంటి వారు మమ్మల్ని సరిదిద్దుతుంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా దర్శకులంతా గొప్పవారు, వినయ, విధేయతలు కలిగిన వారు. నేను ఎప్పటికీ బుర్రలేని వాడినే అని తనపై సెటైర్లు వేసుకున్నారు. ప్రపంచంలో ఉన్న దర్శకులందరూ గొప్పవాళ్లు. వాళ్లతో పనిచేసేందుకు నేను పడి చస్తా. అయితే అందరికన్నా చివరిలో స్థానంలో ఉండే నేనో వయసు మళ్లిన, బుర్రలేని కంపోజర్‌ని అంటూ పేర్కొన్నారు. 
 
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. మరోసారి తమ్మారెడ్డి భరద్వాజ, త్యాగయ్యగారికి ధన్యవాదాలు. నేను వృద్ధుడిని అయిపోయానని ఎలా మర్చిపోయానో? గీత ర‌చ‌యిత‌లంద‌రూ నాకు ఇష్టమే. అన్ని పాటలు వారు కష్టపడి రాశారన్నారు. చంద్రబోస్‌ నా మేనల్లుడు. బంధుప్రీతికే నా ఓటు. ఆ కారణంగా నా సినిమాలకు ఆయన ఎన్నో పాటలు రాశారు. నేను వసుధైక కుటుంబాన్ని, బంధుప్రీతిని నమ్ముతా. నేను బ్రురలేనివాడినైతే అది కరెక్ట్‌ అంటూ ట్వీట్ చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments