Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

దేవీ
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (10:02 IST)
Dimple Hayathi
సక్సెస్ లో వున్న హీరోకు మరో సక్సెస్ వున్న దర్శకుడు హీరోయిన్ రావడం మామూలే. కానీ ముగ్గురికీ సక్సెస్ దోబూచులాడడంతో ఒక్కసారిగా కలిస్తే మరింత మిరాకిల్ జరుగుతుందోమోనని భావిస్తున్నారు. కథానాయకుడు శర్వానంద్ కు ఈమధ్య విజయాలు లేవు. అందుకే శర్వా అనే వెండితెర పేరుగా కుదించుకున్నాడు. ఇక దర్శకుడు సంపత్ నంది గతంలో కొన్ని సక్సెస్ లు ఇచ్చినా గేప్ తీసుకున్నాడు.

ఇటీవలే తమన్నాతో ఓదె2 పేరుతో నిర్మాతగామారాడు. కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇంకోవైపు నాయికగా గతంలో చేసిన డింపుల్ హయతి చాలాకాలం గేప్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురూ ఒకే సినిమాకు పనిచేస్తున్నారు.
 
సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఇప్పటికే కథానాయికగా ఎంపికైంది. తాజాగా డింపుల్ హయతి పేరు కూడా తోడయింది. ఈ సినిమా పీరియాడికల్ డ్రామా, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. కొంత విరామం తర్వాత దర్శకుడిగా తిరిగి వచ్చిన సంపత్ నంది, కల్పిత అంశాలను జోడించడానికి సినిమా స్వేచ్ఛ తీసుకుంటూనే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
 
తెలుగు అమ్మాయి డింపుల్ హయతి గతంలో ఖిలాడి, రామబాణం వంటి సినిమాల్లో నటించింది, కానీ గత రెండేళ్లుగా ఏ ప్రాజెక్టుపైనా సంతకం చేయలేదు. రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో తనుంటున్న అపార్ట్ మెంట్ లో  పోలీస్ కారును ధ్వంసం చేసినందుకు ఆమె వార్తల్లో నిలిచింది, ఫలితంగా పోలీస్ కేసు వచ్చింది.
 
ఆమె వరుణ్ తేజ్ సరసన గద్దలకొండ గణేష్ లో ఒక ప్రత్యేక పాటలో  చేసింది. కథప్రకారం ఆ చిత్రంలో కథానాయికగా నటించాల్సి ఉంది కానీ ఇతర కమిట్‌మెంట్‌ల కారణంగా ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె సంతకం చేసిన ప్రాజెక్ట్ 80% షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు హరీష్ శంకర్, ఆ పాటలో ఆమెకు ప్రత్యేక పాత్రను అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments