Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సొట్ట బుగ్గల సుందరి'ని బుక్ చేసుకున్న వకీల్ సాబ్?

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (11:24 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో సొట్ట బుగ్గల సుందరిగా పేరుగాంచిన హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. తెలుగు వెండితెరకు 'అందాల రాక్షసి 'అనే చిత్రం ద్వారా 2012లో పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా, టాలీవుడ్ "మన్మథుడు" 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. పైగా, నాగార్జునతో సాగించిన రొమాన్స్ సన్నివేశాల్లో అదిరిపోయాలా నటించింది.  ఆ తర్వాత ఈమెకు పెద్ద సినీ అవకాశాలు రాలేదు. దీంతో తెరమరుగైంది. 
 
ఈ క్రమంలో ఇపుడ ఈ సొట్టబుగ్గల సుందరికి బిగ్ ఆఫర్ వరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే తాజా చిత్రం 'వకీల్ సాబ్'. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంద‌ని.. కాదు ఇలియానా న‌టిస్తుందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 
 
తాజాగా ఈ లిస్టులో 'అందాల రాక్షసి' పేరు చేరింది. ఇది నిజ‌మైతే ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ 'ఏ1 ఎక్స్‌ప్రెస్ త‌ప్ప పెద్ద‌గా అవ‌కాశాలు లేని లావ‌ణ్య‌ త్రిపాఠికి మంచి అవ‌కాశ‌మ‌నే చెప్పాలి. మ‌రి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీక‌పూర్‌, దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 15న సినిమా విడుద‌ల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Election : అక్టోబర్ 9 నుండి 31 జిల్లాల్లో పోలింగ్- మార్గదర్శకాలు జారీ

నా మిత్రుడు పవన్ కల్యాణ్ ఎలాంటివారో తెలుసా?: సీఎం చంద్రబాబు (video)

Lady Aghori: అఘోరి కుక్కలాగ వాగితే నేను విని సైలెంట్‌గా ఉండాలా? దాన్ని కోసేస్తా: వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్

హోంవర్క్ చేయలేదని విద్యార్థిని తాడుతో తలకిందులుగా వేలాడదీసి చెంపదెబ్బలు కొట్టించాడు

ఉత్తరప్రదేశ్: 17 ఏళ్ల బాలికను కాల్చి చంపిన తండ్రి, మైనర్ సోదరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments