Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గ్లామర్' అంటే 'న్యూడ్' అని కాదు... స్కిన్ షోకు రెడీ. చూపించే వారే లేరు..: లావణ్య త్రిపాఠి

'అందాల రాక్షసి'తో వెండితెరపై సందడి చేసింది లావణ్య త్రిపాఠీ. ఆ తర్వాతవచ్చిన 'దూసుకెళ్తా'లోనూ కనిపించింది. అయితే. లావణ్యకు గొప్ప అవకాశాలేం రాలేదు. నటిగా ఓకే గానీ, గ్లామర్ విషయంలో అత్తెసరు మార్కులతో నెట్

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (09:35 IST)
'అందాల రాక్షసి'తో వెండితెరపై సందడి చేసింది లావణ్య త్రిపాఠీ. ఆ తర్వాతవచ్చిన 'దూసుకెళ్తా'లోనూ కనిపించింది. అయితే. లావణ్యకు గొప్ప అవకాశాలేం రాలేదు. నటిగా ఓకే గానీ, గ్లామర్ విషయంలో అత్తెసరు మార్కులతో నెట్టుకొస్తోంది. అయితే, మారుతి సినిమా 'భలె భలె మగాడివోయ్‌'తో ఆమె దశ తిరిగింది. ఈ సినిమా తర్వాత వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయిన'లో మరింత గ్లామర్‌ గా కనిపించింది. ఈ రెండు చిత్రాల్లో స్కిన్ షోతో అందరి మతిపోగొట్టింది. 
 
తద్వారా స్కిన్ షోకు తాను ఏమాత్రం వ్యతిరేకం కాదనీ, కానీ చూపించేవారే లేరని వాపోయింది. దీనిపై ఆమె స్పందిస్తూ... "అందాల రాక్షసి టైపు క్యారెక్టర్ కాదు నాది. అంతా కూడా మోడ్రన్ గానే ఉంటాను. అలాగే మోడలింగ్ సమయంలో కూడా గ్లామర్‌నే ఒలకబోశాను. అందుకే నేను చాలాసార్లు నా డైరక్టర్లకు చెప్పాను. నాకు గ్లామర్ రోల్స్ ఇవ్వండి అని. గ్లామర్ అంటే ఎక్స్పోజింగ్ అని కాదు రోల్‌కు కావల్సినట్లు మోడ్రన్ కాస్ట్యూమ్స్‌లో గ్లామరస్‌గా కనిపిస్తా" అంటోంది ఈ భలే భలే భామ.
 
సహజంగా హీరోయిన్లు గ్లామరస్ పాత్రలతో బోరు కొట్టింది, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు కావాలంటూ మొరపెట్టుకుంటుంటారు. కానీ లావణ్య విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉండటం విశేషం. మరి లావణ్యలోని ఆ గ్లామరస్ యాంగిల్‌ను వెలికితీసే దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యాఖ్యల తర్వాత లావణ్య ఫేట్ మారే అవకాశాలు ఉన్నాయని, భారీ సినిమాల అవకాశాలు దక్కవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments