Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొర‌టాల‌ వ‌ర్సెస్ దిల్‌రాజు

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (18:14 IST)
siva, raju
సినిమా కొనుగోలు, అమ్మ‌కాల‌లో పంపిణీదారుల‌దే పైచేయిగా వుండేది. కానీ రానురాను హీరోలు, ద‌ర్శ‌కులు త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తిపు తెచ్చుకున్నాక ఏరియా వారిగా కొనుగోలు హ‌క్కులు షేర్లు అడుగుతున్నారు. ఇలా పెద్ద హీరోల చిత్రాల‌కే జ‌రుగుతాయి. అలాంటిదే తాజాగా మెగాస్టార్ న‌టిస్తున్న `ఆచార్య‌`కు జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాల ప్ర‌కారం కొర‌టాల శివ త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాను మార్కెటింగ్ విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడ‌నే టాక్ వుంది. స‌రైన డిస్ట్రిబ్యూటర్ కు ఆ హ‌క్కులు అప్ప‌గించ‌డం లాభాలు పొంద‌డం జ‌రుగుతుంది. ఒక్కోసారి మీడియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. రొటీన్‌గా వ‌చ్చే డిస్ట్రిబ్యూటర్ కు మ‌ధ్య‌వ‌ర్తిగా వుంటాడు కొర‌టాల‌. త‌ను చెప్పిన రేటు కొనేలా త‌గు ప్ర‌ణాళిక‌లు కూడా వేసుకుంటాడ‌ని స‌మాచారం.
 
ఇప్పుడు ఆచార్య సినిమా గురించి ఆ ఫ్రీడం కొర‌టాల‌కే రామ్‌చ‌ర‌ణ్‌, చిరంజీవి ఇచ్చిన‌ట్లు గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దీన్ని ఆస‌రాగా తీసుకున్న కొర‌టాల నైజాం రైట్స్‌ను దిల్‌రాజుకు కాకుండా వేరేవారికి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో మ‌హేష్‌బాబు సినిమా భ‌ర‌త్ అనే నేను సినిమా కూడా దిల్ రాజకు ఇప్పించారు కొర‌టాల‌. కానీ ఆ తర్వాత అది పెద్ద‌గా ఆశాజ‌నంగా ఆడ‌క‌పోవ‌డంతోపాటు ఆశించినంత రాబ‌డి రాలేద‌ని తెలిసింది. కానీ ఇప్పుడు దిల్‌రాజును కాద‌ని వేరే వారికి ఇవ్వ‌డం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. బ‌హుశా ఎక్క‌డో ఏదో తేడా జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. క‌నుక ఆచార్య సినిమా విడుద‌ల‌కు ముందు ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చ‌ని ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. క‌రోనా వ‌ల్ల ఆచార్య సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. మ‌రి రిలీజ్ కూడా అనుకున్న టైంకు లేట్‌గా అయ్యే అవ‌కాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments