Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌లు రిలేషన్‌లో వున్నారా?

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (16:32 IST)
అనేక షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి కిరణ్ సినిమా సక్సెస్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా రూల్స్ రంజన్ సినిమాతో పలకరించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
 
ఇటీవల పీపుల్స్ మీడియా ఆషు రెడ్డి హోస్ట్ చేస్తున్న ‘దావత్’ అనే షోను ప్రారంభించగా, మొదటి ఎపిసోడ్‌కు కిరణ్ అబ్బవరం అతిథిగా వచ్చారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో కిరణ్ అబ్బవరం పలు విషయాలు చెప్పారు. 
 
అయితే కిరణ్, రహస్య గోరక్‌లు రిలేషన్‌లో వున్నారా అని ఆషు రెడ్డి ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, ఉంటే మేం చెబుతామని కిరణ్ సమాధానమిచ్చారు. రహస్య గోరక్, కిరణ్ అబ్బవరం వారి మొదటి చిత్రం రాజా వారు రాణి గారులో కలిసి నటించారు. 
 
అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆమె చాలాసార్లు కిరణ్ ఇంటికి రహస్యంగా వెళ్లినట్లు సమాచారం. ఇద్దరూ కలిసి విహారయాత్రకు కాశ్మీర్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. 
 
రీసెంట్‌గా ఈ దావత్ షోలో కిరణ్ అబ్బవరం సీక్రెట్ నేమ్ బయటపెట్టడంతో కంగుతిన్నారు. దీంతో వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కిరణ్ దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments