Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అలా చెప్పలేదు.. తప్పుడు వార్తలు రాయొద్దు.. కైరా అద్వానీ

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (19:10 IST)
పారితోషికం తక్కువగా ఇస్తుండటం వల్లే తెలుగు చిత్రాల్లో నటించడం లేదంటూ సాగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటి కైరా అద్వానీ స్పందించారు. తాను ఎన్నడు కూడా అలా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. పైగా, సరైన కథలు లేకే తాను తెలుగులో నటించడం లేదని తెలిపారు.
 
"భరత్ అనే నేను" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ కైరా అద్వానీ. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కైరా అద్వాని, ఆ తర్వాత 'వినయ విధేయరామ' చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నుంచి కైరా తెలుగు సినిమాలు చేయడం లేదు.
 
అదేసమయంలో తెలుగు నుంచి ఆఫర్స్ వెళితే భారీగా పారితోషికం అడుగుతోందనే వార్తలు వచ్చాయి. తాను అడిగిన దానికి తక్కువగా పారితోషికం ఇస్తే చేయనని నిర్మొహమాటంగా చెబుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
దీనిపై కైరా స్పందిస్తూ, "తెలుగు నుంచి నాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. అయితే హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే నేను తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాను. తెలుగులో కథ.. నా పాత్ర నచ్చినప్పుడే ఓకే చెప్పాలనే నిర్ణయంతో వున్నాను. అంతేగానీ పారితోషికం తక్కువైతే చేయనని నేను ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు" అని వివరణ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments