Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ 'ఖైదీ'తో మరోసారి కుమ్మేశాడు.. 3 గంటల్లో మిలియన్ మార్క్ క్రాస్ (Trailer Video)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్ర "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (06:07 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్ర "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్.. ఖైదీ చిత్రానికి మాతృక అయి తమిళ 'కత్తి' సినిమా ట్రైలర్‌ను అచ్చుగుద్దినట్టు ఉందనే విమర్శలు వచ్చాయి. అయితే, వీటన్నింటిని కాదనీ ఈ ట్రేలర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డునే సృష్టిస్తోంది.
 
ఒక విధంగా చెప్పాలంటే మెగాస్టార్ ఖైదీ ప్రీ-రిలీజ్‌తో చిరు రీ-ఎంట్రీ చిత్రం క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎంతగా అంటే.. ప్రి-రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా రిలీజ్ చేసిన ఖైదీ నెం.150 థియేట్రికల్ ట్రైలర్ కేవలం 3 గంటల్లోనే మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ఇది ఎనిమిదో తేదీకి రెండు మిలియన్లను అధికమించింది. 
 
థ్రియేట్రికల్ ట్రైలర్‌లో యాక్షన్‌తో నింపేశాడు. మెగాస్టార్ డైలాగ్స్‌తో ఇరగదీశాడు. మొత్తంగా మాస్ ప్రేక్షకులని ఫుల్లుగా అలరించేలా సాగింది ట్రైలర్. ఇదే విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చెప్పడం విశేషం. మెగా ఖైదీలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ.. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. 
 
అందుకే.. అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేందుకు 'కత్తి' రిమేక్‌ని ఎంచుకొన్నట్టు తెలిపారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్‌తో సత్తాచాటాడు మెగా ఖైదీ. ఇక, ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన తర్వాత ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయన్నది చూడాలి.
 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments