Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖైదీ"లో మరోమారు లిఫ్టిచ్చిన చిరంజీవి... బ్రహ్మీ ఈజ్ బ్యాక్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. బాస్ ఈజ్ బ్యాక

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (06:04 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా అభిమానులు ఖైదీ మూవీతో ఖుషీ అయ్యారు. 
 
అయితే ఖైదీ మూవీతో టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా బౌంస్ బ్యాక్ అవుతాడని న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ మధ్య బ్రహ్మానందం కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఫలితంగా అతనికి అవకాశాలు బాగా తగ్గిపోగా... కుర్ర కమెడియన్స్‌కు ఛాన్సులు వస్తున్నాయి. 
 
దీంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ కమెడియన్ల హవాకి బ్రహ్మానందం క్రేజ్ తగ్గింది. అయితే "ఖైదీ" సినిమాతో బ్రహ్మానందం మళ్ళీ ఫాంలోకి రాబోతున్నాడని.. డైరెక్టర్ వినాయక్ స్పెషల్ కేర్ తీసుకొని కామెడీ ట్రాక్ తెరకెక్కించాడని.. ఖైదీలో బ్రహ్మీ కామెడీ ఇరగదీసేశాడు. 
 
అయితే ఖైదీ రిలీజ్ తర్వాత అందరి అటెంషన్ మెగాస్టార్ చిరంజీవి మీదే పడినప్పటికీ బ్రహ్మానందం నటించిన కామెడీ సన్నివేశాలు కూడా ఈ చిత్రం హిట్ టాక్‌లో కీలక పాత్ర పోషించాయి. దీంతో బ్రహ్మీ ఈస్ బ్యాక్‌ అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments