చిరుతో ఐటమ్ సాంగ్ చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది : లక్ష్మీరాయ్

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఖైదీ నంబర్ 150''. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో కోలీవుడ్ నటి లక్ష్మీరాయ్ కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నా

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (09:47 IST)
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఖైదీ నంబర్ 150''. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో కోలీవుడ్ నటి లక్ష్మీరాయ్ కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్‌లో లక్ష్మీరాయ్ చిరుతో కలిసి నర్తించనుంది. దీనిపై లక్ష్మీరాయ్ హర్షం వ్యక్తం చేసింది. చిరంజీవి సరసన ఓ పాటలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. 
 
గతంలో ఈ ఐటమ్ సాంగ్‌లో కేథరిన్ కనిపించనున్నట్లు వార్తలు వచ్చినా... తాజాగా ఆమె స్థానంలో లక్ష్మీరాయ్‌ను తీసుకోవాలని యూనిట్ సభ్యులు అంటున్నారు. దేవీశ్రీప్రసాద్ మరోసారి చిరు మూవీకి సంగీతం అందిస్తున్నారు. చిరు - ల‌క్ష్మీరాయ్‌ల‌పై ఓ పాట‌ని గురువారం నుంచి హైద‌రాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ పాటను డాన్స్ మాస్ట‌ర్ లారెన్స్ చిత్రీకరిస్తున్నారు‌. చిరుతో లారెన్స్ కాంబినేష‌న్‌లో చాలా హిట్ పాటలొచ్చాయి. ఇప్పుడు మ‌రోటి చేర‌బోతోంద‌న్న‌మాట‌. 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌'లో ప‌వ‌న్‌తో తోబ తోబ పాట‌కు చిందులేసింది ల‌క్ష్మీరాయ్‌. అప్పుడు త‌మ్ముడుతో రొమాన్స్ చేసిన ల‌క్ష్మీరాయ్ ఇప్పుడు అన్న‌య‌తో స్టెప్పులు వేయ‌బోతోంద‌న్న‌మాట‌. 2017 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments