Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్‌కు కలిసిరాని భైరవ.. షూటింగ్‌కు ముందు రిహార్సల్.. గ్లామర్ రోల్స్‌కు ఓకే!

నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ తాజాగా నాని సరసన 'నేను లోకల్‌' చిత్రంలో నటించింది. ఈ సినిమా రిలీజ్ కానున్న తరుణంలో పవన్‌ కల్యాణ్‌తో నటించడానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో మరో చిత్రంలో

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:41 IST)
నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ తాజాగా నాని సరసన 'నేను లోకల్‌' చిత్రంలో నటించింది. ఈ సినిమా రిలీజ్ కానున్న తరుణంలో పవన్‌ కల్యాణ్‌తో నటించడానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో మరో చిత్రంలో నటించడానికి కూడా కీర్తి సురేష్ అంగీకరించిందని టాలీవుడ్‌లో టాక్ వస్తోంది.

కానీ కోలీవుడ్‌లో మాత్రం అమ్మడుకు ఆఫర్లు సన్నగిల్లాయని టాక్ వస్తోంది. ఇటీవల యంగ్ యాక్టర్ విజయ్‌తో నటించిన భైరవలో కీర్తి సురేష్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని సమాచారం. ఈ వార్త ఆ నోటా ఈ నోట పడి ఎలాగో కీర్తి చెవికి చేరింది.
 
బిత్తరపోయిన కీర్తి కోలీవుడ్‌లో తిరిగి తన స్టార్‌డమ్‌ను పొందాలని నిశ్చయించుకుంది. ఇప్పుడు షూటింగ్‌కు ముందు రిహార్సల్‌ చేస్తోందని వినికిడి. ఎప్పుడూ సాధారణ లుక్‌తో కనిపించే కీర్తి కాస్తంత గ్లామర్‌గా కనిపించే కాస్ట్యూమ్స్‌ను సైతం ఎంపిక చేసుకుని, అభిమానులను ఆకట్టుకోవడానికి పాట్లు పడుతున్నట్లు సమాచారం. తెలుగులోనూ, తమిళంలోనూ నటనాపరంగా ఆకట్టుకునేందుకు కీర్తి మల్లగుల్లాలు పడుతోంది. 
 
ఇదిలా ఉంటే.. మహానటి పాత్రలో నటిస్తున్నట్టుగా చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్, మలయాళీ భామ నిత్యామీనన్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు.

ఈ లిస్ట్‌లో మరో పేరు వినిపిస్తోంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన కీర్తీ సురేష్‌ను ఈ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మానవత్వం మంటగలిసిపోయింది.. ట్రక్ డ్రైవర్ గాయపడితే.. ఫోన్, డబ్బు దొంగలించేశారు.. (video)

ఇద్దరితో వివాహం, మరో ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన నగల వ్యాపారి

ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారా.. విమానాలు నడుపుతున్నారా? బస్సు మధ్యలో వ్యక్తి.. ఏమైంది? (video)

Vijay Sai Reddy : విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు.. హాజరవుతారో? లేదో?

జనవరి 8న నరేంద్ర మోదీ పర్యటన- సర్వం సిద్ధం చేస్తోన్న ఏపీ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments