''మహానటి'' సినిమాతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోతోంది. తెలుగులో నేను శైలజతో తెరంగేట్రం చేసిన కీర్తి సురేష్.. ఆపై మహానటి సినిమా ద్వారా సూపర్ క్రేజ్ కొట్టేసింది. తెలుగువారు ఎంతో అభిమానించే సావిత్రి పా
''మహానటి'' సినిమాతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోతోంది. తెలుగులో నేను శైలజతో తెరంగేట్రం చేసిన కీర్తి సురేష్.. ఆపై మహానటి సినిమా ద్వారా సూపర్ క్రేజ్ కొట్టేసింది. తెలుగువారు ఎంతో అభిమానించే సావిత్రి పాత్రలో కీర్తి అద్భుత నటన ప్రదర్శించిన సంగతి అందరికి తెలిసిందే. సినీ ప్రముఖులు కూడా కీర్తి ఆ పాత్రలో పూర్తిగా విలీనమై నటించిందని ప్రసంశల జల్లు కురుపించారు.
సావిత్రి పాత్రలో జీవించిన కీర్తికి మరో అరుదైన అవకాశం వచ్చినట్టు సమాచారం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. ఇందులో నటించమని కీర్తికి ఆఫర్ వచ్చిందని తెలిసింది. కానీ దీనిపై కీర్తి సురేష్ ఇంకా స్పందించలేదు.
అయితే మరోవైపు తమిళ భాషల్లో అనుష్కకి మంచి క్రేజ్ వుంది. హిందీ ప్రేక్షకులకు కూడా దేవసేన సుపరిచితమే. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడంలో ఆమెది ప్రత్యేక స్థానం. అలాంటి అనుష్కను కూడా జయలలిత బయోపిక్ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక జయలలిత సినిమాకి పురిచ్చి తలైవి, అమ్మ అనే రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో ఈ సినిమాను ఆరంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.