Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణబీర్-కత్రినా కైఫ్‌ల బ్రేకప్ తర్వాత సినిమా.. కత్రీనాతో రణబీర్ మాట్లాడట్లేదట!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (11:08 IST)
బాలీవుడ్ హాటెస్ట్ జంటల్లో ఒకరు రణబీర్-కత్రినాకైఫ్. రణబీర్ కపూర్, దీపిక పదుకొనే‌తో బ్రేక్ అయిన తర్వాత కత్రినాకైఫ్‌తో ప్రేమాయణం నడిపాడు. అంతేకాదు కత్రినాకైఫ్ కూడా సల్మాన్ ఖాన్‌తో బ్రేకప్అయిన తరువాత రణబీర్‌తో ప్రేమాయణం ప్రారంభించింది. ఆరు ఏళ్ల బంధం, చివరకు గతేడాది బ్రేకప్ అయ్యింది. బ్రేకప్ అయ్యిన తరువాత కత్రినాతో త‌న మాజీ ప్రియుడు ర‌ణబీర్ క‌పూర్ మాట్లాడ‌డానికి అస్స‌లు ఇష్టప‌డ‌ట్లేద‌ట‌. వీరిద్దరి బ్రేకప్ తరువాత అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్నచిత్రం 'జ‌గ్గా జ‌సూస్'.
 
ఈ సినిమాలో ర‌ణబీర్ క‌పూర్‌, క‌త్రినా కైఫ్ జంటగా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా దాదాపు మూడేళ్ళ క్రితం మొదలైనా ఇప్పటివరకు పూర్తి కాలేకపోయింది. ఎందుకో తెలుసా బడ్జెట్ సమస్యలతో కొంతవరకు, రణబీర్-కత్రినాకైఫ్‌ల బ్రేక్ అప్‌తో మరికొంత ఆలస్యం అవుతోందట. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే కెమెరా ముందు త‌ప్ప అక్క‌డ ఖాళీ స‌మ‌యాల్లో క‌త్రీనాతో ర‌ణబీర్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నాడ‌ట‌. 
 
త‌న మాజీ ప్రియురాలితో అస్స‌లు మాట్లాడడం లేద‌ట‌. అయితే, క‌త్రినా అయినా ర‌ణబీర్‌ను ప్రేమ‌తో ప‌ల‌క‌రిస్తుంద‌నుకుంటే.. ఆమె కూడా అతనినే అనుసరిస్తోందట. ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడకపోవడంతో ఏమి చేయాలో తెలీక దర్శకుడు జుట్టు పీక్కుంటున్నాడట. ఇందులో ఓ ఇంటిమేట్ సీన్ ఉందట ఆ సీన్‌ని కత్రినాకైఫ్ చేయమంటే ససేమిరా చేయనని మొండికేసిందట. 
 
ఎన్ని రకాలుగా బ్రతిమిలాడినా ప్రయోజనం లేకపోవడంతో అచ్చూ ఆమెలా కనిపించే ఓ డూప్‌తో ఆ సీన్స్‌ని చేయించాలని దర్శకుడు డిసైడ్ అయ్యాడట. ఈ వ్యవహారం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలని దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ నోటా ఈ నోటా విషయం లీక్ అవ్వడంతో ప్రస్తుతం బాలీవుడ్ అంతా ఈ వ్యవహారాన్నే చర్చించుకుంటుంది. దాంతో ఏం చేయాలో తెలియక దర్శకుడు సతమతమవుతున్నాడట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani: పోసానికి ఛాతీ నొప్పి వచ్చిందా? సీఐ వెంకటేశ్వర్లు ఏమన్నారు?

అత్త కుంభమేళాకు .. భర్త పనికి వెళ్లారు.. ప్రియుడిని ఇంటికి పిలిచి...

రెండు తలల నాగుపాము.. రెండు ఎలుకల్ని ఒకేసారి తినిస్తోంది.. వీడియో వైరల్

Dhee: ఢీ షో డ్యాన్సర్ నన్ను మోసం చేశాడు.. సెల్ఫీ వీడియో ఆత్మహత్య

ASHA Workers: ఆశా వర్కర్లకు భలే ప్రయోజనాలు.. ఏంటవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments