Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెర 'కరణం మల్లేశ్వరి'గా నిత్యామీనన్? (Video)

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (15:05 IST)
భారత వెయిలిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి బయోపిక్ వెండితెరపై ఆవిష్కృతంకానుంది. ఈ విషయాన్ని ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ చిత్రంలో కరణం మల్లేశ్వరిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మలయాళ కుట్టి నిత్యా మీనన్ పేరు తెరపైకి వచ్చింది. 
 
ఈ సినిమాలో 'కరణం మల్లేశ్వరి' నటించాలని మేకర్స్ నటి నిత్యామీనన్‌ని సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ బయోపిక్‌లో చేసేందుకు నిత్యామీనన్ నో చెప్పిందట. 'మహానటి' చిత్రం విషయంలోనూ ముందు నిత్యామీనన్ పేరే వినిపించింది. కానీ, చివరకు కీర్తి సురేష్ పేరును ఖరారు చేశారు. 
 
అలాగే, ఇపుడు కూడా నిత్యామీనన్ ఈ ‘కరణం మల్లేశ్వరి’ బయోపిక్‌ని రిజిక్ట్ చేసిందని అంటున్నారు. నిత్యామీనన్ కాకుండా ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ‘కరణం మల్లేశ్వరి’గా ఈ చిత్రంలో నటించేందుకు చివరికి ఎవరు ఫైనల్ అవుతారో చూడాల్సి ఉంది. 
 
కాగా, గత కొంతకాలంగా భారతీయ చిత్రసీమలో బ‌యోపిక్స్ ట్రెండ్ కొన‌సాగుతోంది. రాజ‌కీయ‌, సినీ, క్రీడ‌లు స‌హా ప‌లు రంగాల్లో అత్యున్న‌త సేవ‌లు అందించిన ప‌లువురి జీవిత చ‌రిత్ర‌లు వెండితెర‌పై ఆవిష్కత‌మ‌వుతున్నాయి. మ‌రికొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో 2000లో జ‌రిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించ‌డ‌మే కాకుండా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళగా రికార్డ్ క్రియేట్ చేసిన క‌ర‌ణం మల్లేశ్వరి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్క‌రించ‌నున్నారు. 
 
ఎంతో మంది మ‌హిళ‌ల‌కు స్ఫూర్తినిచ్చిన క‌ర‌ణం మల్లేశ్వరి బ‌యోపిక్‌ను పాన్ ఇండియా మూవీగా రూపొందించ‌నున్నారు. ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్‌.సి బ్యాన‌ర్స్‌పై ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కోన‌వెంక‌ట్ నిర్మిస్తున్న ఈ బ‌యోపిక్‌ను సంజ‌నా రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. 
 
కోన‌వెంక‌ట్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాని ప్రకటించారు. అయితే ఈ సినిమాలో కరణం మల్లేశ్వరి పాత్ర ధరించే నటి విషయంలో ఇప్పుడొక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments