Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క సినీ జీవితాన్ని నాశనం చేయాలని భావించిన బాలీవుడ్ దర్శకుడు?

సల్మాన్‌ఖాన్ నటించిన ''సుల్తాన్'' సినిమాలో రెజ్లర్‌గా నటించి ఆడియన్స్ మంచి మార్కులు కొట్టేసింది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ. ఈ సినిమా తరువాత అనుష్కకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా తర్వాత అనుష్

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (09:14 IST)
సల్మాన్‌ఖాన్ నటించిన ''సుల్తాన్'' సినిమాలో రెజ్లర్‌గా నటించి ఆడియన్స్ మంచి మార్కులు కొట్టేసింది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ. ఈ సినిమా తరువాత అనుష్కకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా తర్వాత అనుష్క శర్మ నటించిన తాజా చిత్రం 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు సిద్దంగా ఉంది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. 
 
కరణ్ జోహార్ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్, ఐశ్వర్యారాయ్, ఫవద్‌ఖాన్ లీడ్ రోల్స్ పోషించారు. ఇదిలావుంటే.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి దర్శక నిర్మాత కరణ్ జోహార్ సంచలన వాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నాడంటే... అనుష్క సినీ కెరీర్‌ నాశనం చేయాలని భావించాడట కరణ్. ఈ విషయాన్ని స్వయంగా కరణే వెల్లడించాడు. 
 
గతంలో యశ్‌రాజ్ ఫిలింస్ ఉపాధ్యక్షుడు ఆదిత్య చోప్రా ''బ్యాండ్ బాజా బారాత్'' సినిమా చేస్తున్నప్పుడు అనుష్క శర్మను తీసుకోవాలని భావించాడట. ఆసమయంలో కరణ్‌.. ''అనుష్క ఎందుకు. నీకేమన్నా పిచ్చా? కావాలంటే మరో టాప్‌ హీరోయిన్‌ని తీసుకో'' అని తిట్టాడట. కానీ ఆదిత్య, కరణ్‌ మాట వినకుండా అనుష్కనే హీరోయిన్‌గా ఎంచుకున్నాడట. దీంతో అనుష్కపై కసి పెంచేసుకున్నాడట కరణ్. 
 
కానీ ''బ్యాండ్‌ బాజా బారాత్‌'' సినిమా విడుదలయ్యాక అనుష్క లాంటి ఓ మంచి టాలెంట్‌ని వదులుకోవాలని, ఆమె కెరీర్‌ని నాశనం చేయాలని ఆలోచించి పొరపాటు చేశానని ఫీల్ అయ్యాడట. వెంటనే అనుష్కను కలిసి జరిగిందంతా చెప్పి క్షమాపణలు చెప్పాడట. అప్పటి నుండి తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయామని అంటున్నాడు కరణ్‌. కరణ్ దర్శకత్వంలో వస్తున్న యే దిల్‌ హై ముష్కిల్‌ ప్రమోషన్ భాగంలో ఈ విషయాన్ని వెల్లడించాడు కరణ్. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments