Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదంలో కంగనా రనౌత్.. మణికర్ణికకు ఒప్పుకోవడం ద్రోహం.. ప్రాజెక్టును హైజాక్ చేసింది!?

బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ వివాదంలో చిక్కుకుంది. ఝాన్సీ రాణి కథతో తెరకెక్కే మణికర్ణి ది క్వీన్ ఆఫ్ ఝాన్సీలో కంగనా రనౌత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రాణి ఆఫ్ జాన్సీ.. ది వారియర్ క్వీన్‌లో నటిస్త

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (16:29 IST)
బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ వివాదంలో చిక్కుకుంది. ఝాన్సీ రాణి కథతో తెరకెక్కే మణికర్ణి ది క్వీన్ ఆఫ్ ఝాన్సీలో కంగనా రనౌత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రాణి ఆఫ్ జాన్సీ.. ది వారియర్ క్వీన్‌లో నటిస్తానని ముందుగా కంగనా ఒప్పుకుందని.. అయితే ప్రస్తుతం మణికర్ణిక సినిమాలో చేసేందుకు జంప్ అయినట్లు నిర్మాత కేతన్ మెహతా లీగల్ నోటీసులు పంపాడు. 
 
తన డ్రీమ్ ప్రాజెక్టును కంగనా హైజాక్ చేసిందని ఆ నోటీసుల్లో ప్రస్తావించాడు. ఈ లీగల్ నోటీసుపై తాము చట్టపరమైన చర్యలు సిద్ధంగా ఉన్నామని, కంగనాకు పంపిన నోటీసుపై ఇంకా స్పందన రాలేదని నిర్మాత చెప్పుకొచ్చాడు. తన ప్రాజెక్టులో నటిస్తానని ఒప్పుకున్నాక, కామ్‌గా అదే టాపిక్‌పై మరో ప్రాజెక్టు చేయడం విశ్వాస ఘాతుకమేనని కేతన్ మెహతా చెప్పారు. దీన్ని అంతతేలికగా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు.  
 
ఇదిలా ఉంటే.. గౌతమిపుత్ర శాతకర్ణి పెద్ద సాహసమే చేసి విజయం అందుకున్న క్రిష్ , తాజాగా మరోసారి మరో పెద్ద సాహసమే చేయడానికి రెడీ అయ్యాడు. భారతదేశ ప్రజలందరికీ బాగా సుపరచితమైన 'రాణి లక్ష్మీ భాయ్' జీవితగాథను ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. ఈ చిత్రానికి 'మణికర్ణిక' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను కంగనా రనౌత్ నోటీసులు అందుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments