Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెట్‌లో అసిస్టెంట్లు కవర్ చేస్తుంటే దుస్తులు మార్చుకున్న కంగనా రనౌత్

హిందీ రంగంలో టాప్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయిన కంగనా రనౌత్ తాజాగా నటిస్తున్న చిత్రం ''రంగూన్''. విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (16:12 IST)
హిందీ రంగంలో టాప్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయిన కంగనా రనౌత్ తాజాగా నటిస్తున్న చిత్రం ''రంగూన్''. విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం కంగనా తీసుకున్న పారితోషికం గురించి తెలిస్తే దిమ్మదిరిగి పోవాల్సిందే. ఈ చిత్రం కోసం కంగనా ఏకంగా రూ.10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
అయితే ఇందులో విశేషమేమిటంటే - సైఫ్, షాహిద్‌లకు ఒక్కొక్కొరికి రూ.5 కోట్ల మాత్రమే దక్కాయట. కంగనా రనౌత్ ఒక్కరికే రూ.10 కోట్లు పారితోషికం ముట్టజెప్పడం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కంగనా ఈ సినిమాపై కొన్ని సంచలన వాఖ్యలు చేసింది. త‌న జీవితంలో సెలబ్రిటీ అయినా కొన్ని సార్లు స‌ర్దుకుపోవాల్సిన ప‌రిస్థితులు ఎదుర‌య్యాయ‌ని తెలిపింది. 
 
అసలు విషయం ఏంటంటే... ఈ చిత్రం షూటింగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొండాకోనల్లో జరుగుతోంది. అక్కడ ఎలాంటి గ్రామాలు లేకపోవడంతో కనీస సౌకర్యాలూ కరువేనట. దాంతో కంగనా షూటింగ్‌ మధ్యలో దుస్తులు మార్చుకోవాలంటే చెట్లు, పొదల వెనక్కి వెళ్లి మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఈ విషయాన్ని కంగనా ''నో ఫిల్టర్‌ నేహా'' చాట్‌ షోలో వెల్లడించింది. 
 
ఒక్కోసారి సెట్‌లోని తన అసిస్టెంట్లు చుట్టూ నిలబడి తనని కవర్‌ చేస్తే అప్పుడు దుస్తులు మార్చుకునేదాన్నని తెలిపింది. ఇంతకుముందు క్వీన్‌ సినిమా చిత్రీకరణ నిమిత్తం యూరప్‌లో ఉన్నప్పుడు షూటింగ్‌ జరుగుతున్న ప్రదేశంలోని కెఫెల్లోకి వెళ్లి దుస్తులు మార్చుకున్నానని, పరిస్థితిని బట్టి సెలబ్రిటీలకూ ఇలాంటి కష్టాలు తప్పవని వెల్లడించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments