Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బెండు అప్పారావు'ను బుక్ చేసుకున్న 'చందమామ'

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (08:54 IST)
తెలుగులో తన కామెడీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా వెండితెరకు పరిచయమైనప్పటికీ.. ఆ తర్వాత తన కామెడీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. 
 
అయితే, ఇటీవలి కాలంలో ఈ అల్లరోడు స్పీడు బాగా తగ్గిపోయింది. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ అల్లరి నరేష్‌తో టాలీవుడ్ చందమామ జతకట్టనుందట. 
 
నిజానికి కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లోని అగ్రహీరోలందరితోనూ నటించింది. అయితే కొత్త భామల రాకతో ఇటీవల కాజల్ జోరు కాస్త తగ్గింది. అయినా ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన కాజల్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 
 
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన కాజల్.. ప్రస్తుతం విశ్వనటుడు కమల్‌హాసన్‌కు జోడీగా 'భారతీయుడు-2'లో నటిస్తోంది. తాజాగా తెలుగులో మరో ఆసక్తికర సినిమాకు కాజల్ ఓకే చెప్పిందట. కొరియా సినిమా 'డ్యాన్సింగ్ క్వీన్' తెలుగు రీమేక్‌లో కాజల్ నటించబోతోందట. 
 
ఇందులో కాజల్‌తో పాటు అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన సురేష్ బాబు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాజల్ తమ సినిమాలో నటించేందుకు అంగీకరించిందని తెలిపారు. అయితే ఈ సినిమాకు ఇంకా దర్శకుణ్ని ఎంపిక చేయలేదని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments