తేజకు వార్నింగ్ ఇచ్చిన కాజల్.. ఎందుకు?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (17:47 IST)
సినీనటి కాజల్‌ను తెలుగు సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చిందే దర్సకుడు తేజ. ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది. కానీ దర్శకుడు తేజతో మాత్రం పెద్దగా సినిమాలు చేయలేదు కాజల్. రీసెంట్‌గా కాజల్‌తో సీత అనే సినిమా చేస్తున్నాడు తేజ. త్వరలోనే సినిమా విడుదల కాబోతోంది.
 
అయితే సీత సినిమాలో కొన్ని సీన్లు అభ్యంతరంగా ఉన్నాయట. అందాలను ఆరబోసే సీన్లు ఎక్కువగా ఉన్నాయట. టాప్ రేంజ్‌లో వెళ్ళిన తరువాత ఇలాంటి సీన్లు చేయడం కాజల్‌కు ఏ మాత్రం ఇష్టం లేదట. కాజల్ ఆ సినిమాలో అలాంటి సీన్లలో యాక్ట్ చేయడం ఆమె తండ్రికి కూడా ఇష్టం లేదట. అయితే ఈ విషయంపై తేజతో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదట. కారణం తన సినిమాలన్నీ వరుస ఫ్లాప్‌లు కావడమేనట. 
 
అందుకే ఎలాగైనా ఈ సినిమా అయినా భారీ విజయం సాధించాలని, తిరిగి తనకు మంచి పేరు రావాలన్న ఉద్దేశంతోనే తేజ ఇలా చేస్తున్నాడట. దీంతో కాజల్‌కు చిర్రెత్తుకొచ్చి పేరు ఒకటి సినిమాలో మరొకటి ఉండడం మంచిది కాదని వార్నింగ్ కూడా ఇచ్చేసిందట. మొదట్లో సున్నితంగా చెప్పిన కాజల్ ఇప్పుడు మాత్రం తేజపై చాలా సీరియస్‌గా ఉందని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments