Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోరికను దర్శక నిర్మాతలు నెరవేరుస్తారనే నమ్ముతున్నా : కాజల్

తమిళం, తెలుగు భాషల్లో దాదాపు ప్రముఖ కథానాయకులందరితోనూ నటించి టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కోలీవుడ్ హీరో జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ ''కవలై

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (09:01 IST)
తమిళం, తెలుగు భాషల్లో దాదాపు ప్రముఖ కథానాయకులందరితోనూ నటించి టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కోలీవుడ్ హీరో జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ ''కవలై వేండాం''. ఈ చిత్రాన్ని తెలుగులో ''ఎంత వరకు ఈ ప్రేమ'' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
ఈ సినిమాతో కాజల్‌కు వరుస అవకాశాలు వెలువెత్తుతున్నాయి. ఈ భామ తాజాగా అజిత్‌తో కలిసి నటిస్తోంది. అదేవిధంగా తెలుగులో యువ స్టార్స్ అందరితోనూ జత కట్టిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఆయన 150వ చిత్రంలో నటించే లక్కీచాన్స్‌ను కొట్టేసింది. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోలతో నటించడంతో సీనియర్ నటి అని అనడంతో తన బాధ్యత మరింత పెరిగిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్ పేర్కొన్నారు. ఆ భేటీలో తెలుపుతూ నటిగా పదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. 
 
వరుసగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నటించడం వల్ల కొన్ని విషయాల్లో నాకు నేనే సర్దిచెప్పుకోవలసి వచ్చింది. అయితే ఇకపై చెత్త చిత్రాలను అంగీకరించరాదన్న నిర్ణయానికి వచ్చాను. బలమైన పాత్రలు, స్త్రీ ప్రాధాన్యత గలిగిన చిత్రాలనే అంగీకరించాలనుకుంటున్నాను. ముఖ్యంగా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నాను. దర్శక నిర్మాతలు నా కోరికను నెరవేరుస్తారని నమ్ముతున్నాను అని కాజల్ తన మనసులోని మాటను చెప్పారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments