Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పిచ్చెక్కిస్తా' ఆడియోలో కాజల్ టెన్షన్ టెన్షన్... అయ్యో బూతు సిన్మా ప్రమోషనా...?

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (13:11 IST)
పాపం కాజల్ అగర్వాల్ స్టేజిపైకొచ్చి తెగ టెన్షన్ పడిపోయిన క్షణాలవి. చిత్ర దర్శకుడు తమ చిత్ర ఆడియో వేడుకకు అతిథిగా రావాలంటూ కాజల్ ను ఆహ్వానించాడట. దాంతో పొంగిపోయిన కాజల్ అగర్వాల్ చిత్రం గురించి వెనకా ముందూ తెలుసుకోకుండా పరుగెట్టుకుంటూ వచ్చేసింది. అలా వచ్చిన తర్వాత స్టేజిపైకి ఎక్కిన తర్వాత టైటిల్ పిచ్చెక్కిస్తా అని తెలిసిన దగ్గర్నుంచి లోలోన టెన్షన్ పడుతూ అనవసరంగా వచ్చానురా దేవుడా అనుకుంటూ వాపోయిందట. 
 
ఐనా అవన్నీ బయటకు కనిపించనీయకుండా... "నా దృష్టిలో చిన్న సినిమా ,పెద్ద సినిమా అనే తేడా లేదు. అన్ని సినిమాలు ఒక్కటే. నా కెరీర్‌లో నేను చేసిన సినిమా గుర్తకువస్తుంది. అప్పట్లో నేను బెరుకుగా వుండేదాన్ని. అటువంటి చిన్న సినిమాకు హాజరు కావడం ఆనందంగా ఉంద"ని భారీ డైలాగులు కొట్టేసిందట కాజల్‌.
 
శ్రీకాంత్‌రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా 'పిచ్చెక్కిస్తా'. ఈ ఆడియోకు ఆమె హాజరైంది. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... ఓ అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయిని వేధించి ప్రేమించేలా చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్‌తో కుర్రాడి పరిస్థితి మారుతుంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది అని పేర్కొన్నారు. ఈ సినిమాను సెప్టెంబర్‌ 5న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు నటరాజ్‌, రాజశేఖర్‌ తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments