Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌ బాస్ హౌస్‌కు హాటెస్ట్ ఉమెన్ టెన్నిస్ ప్లేయర్.. ఎవరు?

తెలుగులో యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మా స్టార్ టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షో.. బిగ్‌ బాస్. ఇందులో పలువురు సినీ సెలెబ్రిటీలు పార్టిసిపెంట్స్‌గా ఉన్నారు. వీరిలో కొందరు బిగ్‌బాస్ హౌస్ నుంచి

Webdunia
గురువారం, 27 జులై 2017 (17:25 IST)
తెలుగులో యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మా స్టార్ టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షో.. బిగ్‌ బాస్. ఇందులో పలువురు సినీ సెలెబ్రిటీలు పార్టిసిపెంట్స్‌గా ఉన్నారు. వీరిలో కొందరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు పరితపిస్తున్నారు. ఈపరిస్థితుల్లో వివాదాస్పద క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన హాట్ టెన్నిస్ ప్లేయర్ గుత్తా జ్వాలా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
నిజానికి ఈ షో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. వారాంతాల్లో మాత్రం హీరో జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యానం పుణ్య‌మాని రేటింగ్స్ వస్తోంది. మిగిలిన రోజుల్లో పార్టిసిపెంట్ల ఓవ‌ర్ యాక్ష‌న్ చూడ‌టానికి ప్రేక్ష‌కులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే త్వ‌ర‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త పార్టిసిపెంట్ల‌ను బిగ్‌ బాస్ ఇంట్లోకి పంపేందుకు చర్యలు చేపట్టారు. 
 
ఇందులోభాగంగా, ఈ నేప‌థ్యంలో బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాను క‌లిసిన‌ట్లు స‌మాచారం. ఇదివ‌ర‌కు కూడా షోలో కొత్త‌ద‌నం కోసం యాంక‌ర్ అన‌సూయ‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ట్లు వార్త‌లు గుప్పుమన్నాయి. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆమె స్వయంగా తేల్చారు. 
 
అలాగే, అంతో ఇంతో క్రేజ్ ఉన్న సంపూ అర్థంత‌రంగా వెళ్లిపోవ‌డంతో బిగ్‌ బాస్ షోకు ఈ వారం నుంచి రేటింగ్స్ త‌గ్గే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇకపోతే.. మిగిలిన పార్టిసిపెంట్ల‌లో ఇప్ప‌టికే మ‌ధుప్రియ‌, ముమైత్‌, క‌ల్ప‌న‌లు ఇంటి మీద బెంగ‌తో ఏడుస్తూ కనిపిస్తున్నారు. 
 
వీళ్ల‌ని వీలైనంత త్వ‌ర‌గా ఇళ్ల‌కు పంపి కొత్త వాళ్ల‌ను దింపే ప్ర‌య‌త్నంలో బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఉన్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కోవలోనే గుత్తా జ్వాలాను పంపనున్నారట. అయితే ఈ షో ప్రారంభంలోనే బిగ్‌ బాస్ ఆఫర్‌ను జ్వాలా గుత్తా తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments