Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జనతా గ్యారేజ్' రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందా? జూనియర్ ఫ్యాన్స్ సందేహం?

జూనియర్ ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం ఇటీవల విడుదలై టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే కేవలం మూడు

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:04 IST)
జూనియర్ ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం ఇటీవల విడుదలై టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే కేవలం మూడు రోజుల్లో రూ.50 కోట్లు వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.
 
తెలుగు సినీపరిశ్రమలో తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాల జాబితాలో 'జనతా గ్యారేజ్' ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందా? లేదా? అనే విషయంపైనే ఇండస్ట్రీలో సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
అయితే, ఈ చిత్రానికి ఓ చిత్రం పోటీ రానుంది. అదే తమిళ హీరో విక్రమ్ నటించిన 'ఇంకొక్కడు'. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా తప్ప పెద్ద హీరోల సినిమాలేవి ఈ నెలలో విడుదలయ్యే పరిస్థితి లేదు. దీంతో 'జనతా గ్యారేజ్‌' ఖచ్చితంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని జూనియర్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే 'జనతా గ్యారేజ్' ఆ మార్క్‌ను చేరుకుంటుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. దీనికి ప్రధాన కారణం పైరసీ. పైరసీ నియంత్రణకు ఎన్నిచర్యలు తీసుకున్నా కొన్ని వెబ్‌సైట్లు మాత్రం ఈ భూతాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ పైరసీ అధిగమించగలిగితే సినిమా రూ.100 కోట్లను సాధించడం పెద్ద విషయమేమికాక పోవచ్చని ఫిల్మ్ వర్గాల సమాచారం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments