కె.సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రంలో బోయపాటి శ్రీను వెండితెరకు పరిచయం చేసిన విలన్ జగపతి బాబు. ఈయన ఒకనాటి హీరో. బాలకృష్ణ హీరోగా బోయపాటి
కె.సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రంలో బోయపాటి శ్రీను వెండితెరకు పరిచయం చేసిన విలన్ జగపతి బాబు. ఈయన ఒకనాటి హీరో. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'లెజెండ్' చిత్రంలో పక్కా విలన్‌గా మారిపోయాడు.
ఆ సినిమాతో ఆయన కెరియర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "లింగా" చిత్రంలోనూ జగ్గూభాయ్ విలన్‌గా నటించాడు. ఇలా పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషిస్తూ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు.
దీంతో చెర్రీ హీరోగా నటించే 'రంగస్థలం 1985' సినిమాలో జగ్గూభాయ్ విలన్‌గా చేస్తుండటం విశేషం. అయితే వాళ్ల పాత్రలు ఎలా ఉంటాయనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.