Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 150వ సినిమా హీరోయిన్‌ ఎవరో? జాక్వెలైన్ రూ.5కోట్లు డిమాండ్ చేసిందట!

చిరంజీవి తన 150వ సినిమాపై రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. కత్తిలాంటి కథ, డైనమిక్‌ మాస్‌ డైరెక్టర్‌ను ఎంచుకోవడంలో క్లారిటీ వచ్చినా.. హీరోయిన్‌ ఎవరనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. తమిళంలో హిట్టయిన

Webdunia
శనివారం, 9 జులై 2016 (09:35 IST)
చిరంజీవి తన 150వ సినిమాపై రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. కత్తిలాంటి కథ, డైనమిక్‌ మాస్‌ డైరెక్టర్‌ను ఎంచుకోవడంలో క్లారిటీ వచ్చినా.. హీరోయిన్‌ ఎవరనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. తమిళంలో హిట్టయిన ''కత్తి'' చిత్రాన్ని తెలుగులో ''కత్తిలాంటోడు'' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్‌ వివివినాయక్‌. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో చాలా మార్పులు చేశారు వినాయక్. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటిస్తారు అన్నది మాత్రం రోజు రోజుకు హాట్ టాపిక్‌గా మారింది.
 
టాలీవుడ్‌లోని అందరు సీనియర్ హీరోల సరసన అనుష్క పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని.. అలాగే చిరుకు సరైన జోడి అవుతుందని అంతా సూచిస్తున్నారట. దీంతో చిరు కూడా దేవసేనపై మనసుపారేసుకున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కాని కొన్నికారణాల వల్ల అనుష్క కూడా సై అయినట్టు సమాచారం. ఎట్టకేలకు బాలీవుడ్ భామలను రంగంలోకి దింపేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 
దీంతో బాలీవుడ్ సెక్సీ గర్ల్ జాక్వెలైన్ ఫెర్నాండజ్‌ని సంప్రదించారట. ఈ అమ్మడు వారిని దిమ్మదిరిగే రెమ్యునరేషన్ అడిగిందట. రూ.5 కోట్లు ఇస్తే నేను చేయడానికి రెడీ అని తేల్చిచెప్పేసిందట. ఈ సెక్సీ ఫిగర్‌ని తెలుగు తెరపై చూడాలంటే మనోళ్ళు 5కోట్లు ముట్టజెప్పాలా... జాక్వెలైన్ ఫెర్నాండజ్.. నర్గీస్ ఫక్రీ వంటి భామలను హీరోయిన్లుగా పెట్టుకునే బదులు.. మన అచ్చ తెలుగు అమ్మాయిలను పెట్టుకుంటే బెస్ట్ కదూ. చూద్దాం మరి ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఏం డెసిషన్ తీసుకుంటాడో!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం