Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ప్రేమికుడు కాదట.. ఫ్రెండేనట.. ప్రేమా దోమా ఏమీ లేదు: యులియా వంటూర్‌

బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే మాట వినగానే గుర్తొచ్చే మొదటి పేరు సల్మాన్ ఖాన్. ఈ బాలీవుడ్ కండ‌ల వీరుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడనే ఆసక్తి అభిమానుల్లో చాలానే ఉంది. కాగా సల్మాన్‌ఖాన్ ఖాన్‌ ర

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (14:22 IST)
బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే మాట వినగానే గుర్తొచ్చే మొదటి పేరు సల్మాన్ ఖాన్. ఈ బాలీవుడ్ కండ‌ల వీరుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడనే ఆసక్తి అభిమానుల్లో చాలానే ఉంది. కాగా సల్మాన్‌ఖాన్ ఖాన్‌ రొమేనియన్‌ మోడల్‌ యులియా వంటూర్‌లు ప్రేమించుకుంటున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఓ పక్క ఈ పుకార్లను కొట్టిపారేస్తూనే మరో పక్క వీరిద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. 
 
మరోపక్క సల్మాన్‌కి వంటూర్‌తో నిశ్చితార్థమైందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. అదీ కాకుండా ''సుల్తాన్‌'' చిత్ర షూటింగ్‌ సెట్స్‌కు వంటూర్‌ వెళ్లడం... ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో ఈ వార్తాలన్నీ నిజమేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ ప్రేమ పుకార్లపై యులియా పెదవి విప్పింది. ''సల్మాన్‌ నేను మంచి స్నేహితులం. స్నేహితులమంటే అర్ధం స్నేహితులమనే. అంతేకానీ మా మధ్య ప్రేమా దోమా ఏమీ లేదు. ఏదైనా జరగాల్సి ఉంటే మనం తొందర పడినంత మాత్రాన ఏమీ జరగదు.
 
అలా అని ఆలస్యంగా జరగదు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. ఇప్పటివరకు మా మీద వచ్చిన వార్తలన్నీపుకార్లే'' అని తన మనసులోని మాటను బయటపెట్టింది యులియా. ఇవన్నీ నిజంకాక పోతే సల్మాన్‌ సోదరి అర్పితాఖాన్‌కి బాబు పుట్టిన అనంతరం జరిగిన ఓ వేడుకలో యులియా పాల్గొనటం.. ట్యూబ్‌లైట్‌ సినిమా చిత్రీకరణ సమయంలో బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలవడానికి సల్మాన్‌తో కలిసి జంటగా వెళ్లడం.. ఈ రెండూ సల్మాన్‌కు యులియా ఎంత ముఖ్యమో చెప్పకనే చెబుతోందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ వార్తలపై ఎంతవరకు నిజముందో సల్లూకే తెలియాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments