Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతో లక్ష్మీరాయ్ అలా చేసినందుకు అంతా అలానే కావాలంటున్నారట...

మెగాస్టార్‌తో నటించే అవకాశమంటే ఏ నటుడికైనా, ఏ నటికైనా జాక్‌పాట్ కిందే లెక్క. అలాంటిది ఖైదీ నెం 150 సినిమాలో చిరంజీవితో కలిసి నటించినందుకు లక్ష్మీరాయ్ కుమిలి పోతోందట. చిరంజీవితో నటించడం వల్ల తన కెరీర్‌కే ముప్పు ఏర్పడిందని బాధపడుతోందట లక్ష్మీరాయ్. ఖైదీ

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (18:39 IST)
మెగాస్టార్‌తో నటించే అవకాశమంటే ఏ నటుడికైనా, ఏ నటికైనా జాక్‌పాట్ కిందే లెక్క. అలాంటిది ఖైదీ నెం 150 సినిమాలో చిరంజీవితో కలిసి నటించినందుకు లక్ష్మీరాయ్ కుమిలి పోతోందట. చిరంజీవితో నటించడం వల్ల తన కెరీర్‌కే ముప్పు ఏర్పడిందని బాధపడుతోందట లక్ష్మీరాయ్. ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరుతో కలిసి ఐటమ్ సాంగ్‌కు స్టెప్పులేసిన లక్ష్మీరాయ్ కెరీర్ ముగిసిపోనుందా... అంటే సినీ ప్రముఖులు అవుననే సమాధానమిస్తున్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌‌తో సర్దార్ గబ్బర్ సింగ్‌లో కలిసి స్టెప్పులేశాక లక్ష్మీరాయ్‌కి చిరుతో అవకాశమొచ్చింది. 
 
ఈ అవకాశం రాగానే రాయ్ ఎగిరిగంతేసినంత పని చేసింది. హీరోయిన్‌గా రాయ్ లక్ష్మికి మంచి గుర్తింపే ఉంది. ఎన్ని ఐటమ్ సాంగ్స్ చేసినా అమ్మడు మంచి మార్కులు కొట్టేస్తోంది. అయితే ప్రస్తుతం ఖైదీ నెం.150లో పాటకు డ్యాన్సులు వేశాక రాయ్ లక్ష్మిని ఐటమ్ సాంగ్‌లు మాత్రమే చేయమంటూ నిర్మాతలు క్యూ కడుతున్నారు. పారితోషికం ఎంత కావాలంటే అంత ఇస్తామని చెబుతున్నారు. ఇది లక్ష్మీరాయ్‌కి సంతోషాన్నిచ్చినా హీరోయిన్‌గా కాకుండా ఐటమ్ గర్ల్‌గా నటించాల్సి రావడంపై సమస్యగా వుందట.
 
ఐటం గర్ల్‌గా ముద్రపడిపోతే ఇక హీరోయిన్ కావడం సాధ్యం కాదనేది లక్ష్మీరాయ్ ఆలోచన. ఇప్పటివరకు హీరోయిన్ అవకాశం రాకపోవడంతో చిరుతో ఐటం సాంగ్ ఎందుకు చేశామా అని బాధపడుతోందట లక్ష్మీరాయ్. కాగా బాలీవుడ్లో జూలీ 2 చిత్రం చేస్తున్నా అదంతా పూర్తిగా స్కిన్ షోకే పరిమితం కావడం చూస్తుంటే ఇక లక్ష్మీరాయ్ మరో నమితలానో లేదంటే షెర్లిన్ చోప్రా... తదిర హాటెస్ట్ తారల లిస్టులో చేరిపోవడం ఖాయమనే కామెంట్లు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments