Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న ఎస్.పి.బాలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (12:02 IST)
కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు సినీ గాయకుడైన గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం తన 51వ పెళ్లి రోజు వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన సోమవారం తన 51వ వివాహ వార్షికోత్స‌వాన్ని ఆసుప‌త్రిలోనే శ్రీమ‌తితో క‌లిసి చేసుకున్నాడ‌ని తమిళ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వేడుకల్లో డాక్ట‌ర్లు, ఐసీయూ సిబ్బంది కూడా పాల్గొన్నట్టు సమాచారం. ఈ దంప‌తులు ఇద్ద‌రు కేక్ కూడా క‌ట్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
మ‌రోవైపు ఎస్పీ బాలసుబ్రమణ్యం పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాబోతున్న తరుణంలో ఆసుపత్రి నుండి ఆయన ఓ పాట‌ని ఆల‌పించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆయ‌న పాడిన ఆడియో క్లిప్ ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేశారు. అయితే, అది గతంలో పాట అని తేలిపోయింది. కాగా, బాలు ఆగ‌స్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో క‌రోనాతో అడ్మిట్ అయిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం గుడ్ న్యూస్ రాబోతుంద‌ని ఆయ‌న త‌న‌యుడు చ‌ర‌ణ్ ఇటీవ‌ల ఓ వీడియో ద్వారా తెలియ‌జేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు

ఖాకీల సమయస్ఫూర్తి .. ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడారు..

Ram Gopal Varma: ప్రకాశం జిల్లాకు రానున్న రామ్ గోపాల్ వర్మ.. ఎందుకో తెలుసా?

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ప్రియుడి ఫ్యామిలీ!!

అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments