Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ ప్రియురాలు మిస్సింగ్... కేసును ముంబైకు మార్చాలంటూ పిటిషన్

Webdunia
బుధవారం, 29 జులై 2020 (17:10 IST)
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తి అదృశ్యమయ్యారు. ఈ కేసులో రియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తన కుమారుడు ఆత్మహత్య కేసులో రియాపై సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై కేసు నమోదైంది. 
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, బీహార్ పోలీసులు బుధవారం ముంబైకు చేరుకున్నారు. ముంబైలోని తన నివాసానికి వెళ్లారు. అప్పటికే ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. పైగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా, బీహార్ పోలీసులకు ఆమె సహకరించేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. 
 
అదేసమయంలో ఈ కేసు విచారణను పాట్నా నుంచి ముంబైకు మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని రియా చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మనీషిండే తెలిపారు. 
 
 
రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... 
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దేశంలో పెను సంచలనమే రేపింది. ముఖ్యంగా, మూవీ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం (బంధుప్రీతి) అంశం తెరపైకి వచ్చింది. గతంలో హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ అంశం ఉంటే.. ఇపుడు నెపోటిజం అంశం వెలుగులోకి వచ్చింది. ఇపుడు సుశాంత్ కూడా నెపోటిజం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారనే విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. దీంతో ముంబై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు.. అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీలను విచారిస్తున్నారు. 
 
ఈ క్రమంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా విచారించారు. అయితే, ఎక్కువ మంది రియా - సుశాంత్ ప్రేమబంధంపై అనేక విషయాలు వెల్లడించారు. పైగా, సుశాంత్ తండ్రి కూడా రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రియా చక్రవర్తి గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది. ముఖ్యంగా సుశాంత్ ప్రియురాలిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. 
 
సుశాంత్ ఆత్మహత్య విషయంలో రియాపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్ మరణానికి ముందు బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్‌తో ఆమె సన్నిహితంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, రియాపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు కొన్ని విషయాలను చెప్పారు. దీంతో, రియాపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రియాకు పోలీసుల ఉచ్చు బిగుస్తోంది.
 
పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్‌లో సుశాంత్ తండ్రి ఏం చెప్పారంటే... గత ఏడాది కాలంలో రూ.17 కోట్లలో ఒక అజ్ఞాత వ్యక్తికి రూ.15 కోట్లు బదిలీ అయ్యాయని.. ఇందులో రియా పాత్ర ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని పోలీసులను ఆయన కోరారు. దీంతో, రియాపై పోలీసులు దృష్టిసారించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం... కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే..

Zakir Hussain Dies ఉస్తాద్ జాకీర్ హుస్సేనే ఇకలేరు... నిర్ధారించిన కుటుంబ సభ్యులు

అలా చేయడమే నిజమైన సనాతన ధర్మం : ఉపాసన

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments