Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లిపై క్లారిటీ.. వరుడు ఆయనేనా?

ఠాగూర్
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (12:12 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ సీనియర్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇంతకాలం టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్‌ను పెళ్లాడనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇపుడు ఈ ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పడినట్టుగా భావిస్తున్నరు. తాజాగా ఆమె పెళ్లిపై వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఈసారి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి గురించే ఈ వార్తలన్నీ. దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అనుష్క మెడలో త్వరలోనే తాళి కట్టబోతున్నాడని ఇంటర్నెట్ హోరెత్తిస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమేనని చెప్తున్నారు. 
 
ఓ వెబ్‌సైట్ కథనం మేరకు.. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను అనుష్క త్వరలోనే పెళ్లాడబోతున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ఇప్పటికే పెళ్లిపై మాటముచ్చట ఆడుకున్నారు. అయితే, షరా మమూలుగానే అనుష్క కానీ, ఆమె సిబ్బంది కానీ ఈ వార్తలపైనా స్పందించలేదు. అయినప్పటికీ ఈ వార్త మాత్రం వైరల్ అయింది. కాగా, అనుష్కకు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌కు మధ్య సంబంధం ఉందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను కూడా అనుష్క ఖండించింది.
 
ఇదిలావుంటే, అనష్క, ప్రభాస్‌ల మధ్య అనేక పుకార్లు వచ్చాయి. ప్రభాస్‌తో డేటింగ్‌లో ఉందని త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కుప్పలుతెప్పలుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ వారిద్దరిలో ఎవరూ ఎప్పుడూ దీనిపై బహిరంగంగా స్పందించలేదు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వారు ఎన్నిసార్లు నెత్తీనోరు బాదుకుని చెప్పినా పుకార్ల ప్రవాహం మాత్రం ఆగలేదు. ఈ తాజా కథనంపై అనుష్క శెట్టి వివాహంపై సాగిన ప్రచారానికి చెక్ పడినట్టే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

Jagan Birthday: జగన్‌కు నాగబాబు, చంద్రబాబుల పుట్టినరోజు శుభాకాంక్షలు

Revanth Reddy: సినిమా వాళ్లకు రేవంతన్న వార్నింగ్.. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలుండవు..

Revanth Reddy:Allu Arjun కాళ్ళు పోయాయా, చేతులు పోయాయా... ఓదార్పు ఎందుకు? (video)

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments