Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' చిత్రంలో పాత్రధారుల నుదుట పెట్టిన బొట్లు వెనుక సీక్రెట్స్...

'బాహుబలి' చిత్రం మహాకావ్యంలా తెరకెక్కించారు ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి. కేవలం కథ, స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్, సంగీతం, ఫోటోగ్రఫీ, ఫైట్స్, ఆర్ట్ వంటి అంశాల్లోనే కాకుండా ఈ చిత్రంలోని నటీనటులు ధరించి

Webdunia
సోమవారం, 22 మే 2017 (15:12 IST)
'బాహుబలి' చిత్రం మహాకావ్యంలా తెరకెక్కించారు ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి. కేవలం కథ, స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్, సంగీతం, ఫోటోగ్రఫీ, ఫైట్స్, ఆర్ట్ వంటి అంశాల్లోనే కాకుండా ఈ చిత్రంలోని నటీనటులు ధరించిన దుస్తులు, నుదుట పెట్టుకున్న బొట్లుపై కూడా దర్శకుడు లోతుగా శ్రద్ధ చూపించారు. దీనికి కారణం ఈ చిత్రంలో ఆయా పాత్రధారులు నుదుట పెట్టిన బొట్లే. ప్రతి పాత్రధారి నుదుట పెట్టిన బొట్టు వెనుక ఓ సీక్రెట్ (పరమార్థం) దాగివుంది. అదేంటో పరిశీలిద్ధాం. 
 
అమరేంద్ర బాహుబలి : సగం చంద్రుడి బొట్టు పెట్టారు. శివగామి వంటి వ్యక్తిత్వంతో పాటు మరికొన్ని మంచి సుగుణాలు కలిగివుంటారు. ప్రజల పట్ల కరుణ, జాలి చూపిస్తారు. ప్రశాంతమైన మనసుతో ఉంటారు. అందుకే సగం బొట్టు. 'మగధీర' చిత్రంలో రాంచరణ్‌కు కూడా ఇలాంటి బొట్టునే దర్శకుడు రాజమౌళి పెట్టారు కూడా. 
 
మహేంద్ర బాహుబలి : శుంకులో చిక్కుకున్న పాము బొట్టు. ఇది ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి, అందరినీ శాసించేవారై.. ఎంతో బలవంతులుగా ఉంటారట. అందుకే శివుడుకి ఆ బొట్టు పెట్టారట. 
 
దేవసేన : ఈమె పెట్టుకున్న బొట్టు లింగ వివక్షకు వ్యతిరేకం. ఆడ, మగా ఇద్దరూ సమానమేనని తెలుపేలా పెట్టారు. నుదుట పెట్టుకున్న బొట్టు కూడా స్త్రీపురుషుడు కలిసివున్నట్టుగా ఉంటుంది. 
 
భళ్లాలదేవ : సూర్యడి బొట్టు. ఎన్ని కోట్ల సంవత్సరాలైనా సూర్యుడు ఒకేలా ఉంటాడు. అలాగే, భళ్లాల దేవుడు కూడా ఎప్పటికీ అదే బలం, రాజసం కలిగివుంటాడు. 
 
శివగామి : నిండు చంద్రుడు బొట్టుతో కనిపిస్తుంది. ధైర్యానికి, సాహసోపేత నిర్ణయాలకు, భద్రత, ఆప్యాయతలు, అనురాగం, ప్రేమకు నిదర్శనం. అందుకే ఈమె పాత్రకు తగినట్టుగా బొట్టు పెట్టారు. 
 
బిజ్జాలదేవ : త్రిశూలం గుర్తుతో ఈ బొట్టు ఉంటుంది. మనషుల్లో ఉండే మూడు గుణాల్లో సత్య, రజో, తామస గుణాల్లో మూడోదైన తామస గుణాన్ని ఈ పాత్రధారి ప్రతిబింభిస్తాడు. అసమతుల్యత, రోగం, గందరగోళం, తొదరపాటు, మోసం, అసూయ, ద్వేషం వంటి వ్యక్తిత్వాలను ప్రతిబింభిస్తుంది. అందుకే త్రిశూలం బొట్టును పెట్టారు. 
 
కట్టప్ప : కట్టప్ప పెట్టుకున్న బొట్టు బానిసత్వానికి సంకేతం. నిస్సహాయతకు ప్రతీక. అందుకే ఆ బొట్టు.
 
అవంతిక : ప్రతీకారం కోసం, ఇందుకోసం ఆమె ఓ ఆయుధంగా మారుతుందని దాని అర్థం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

Donald Trump: భారతదేశంపై ట్రంప్ అక్కసు, యాపిల్ ప్లాంట్ ఆపేయమంటూ ఒత్తిడి

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments