Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్‌కు మ‌ళ్ళీ గాయాలు!

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (10:11 IST)
Vishal
యాక్ష‌న్ హీరో విశాల్‌కు మ‌ళ్ళీ గాయాల‌య్యాయి. యాక్ష‌న్ సీన్స్ చేసేట‌ప్పుడు కొన్నిసార్లు డూప్ లేకుండా చేయ‌డం అల‌వాటు. ఇటీవ‌లే సామాన్యుడు సినిమాలో ఆయ‌న ఓ హోట‌ల్‌లో రౌడీల‌తో ఫైట్ చేస్తుండ‌గా షోడాలు విసిరివేయ‌డంతో గాజుముక్క‌లు వ‌చ్చి కంటికి దిగువ‌న గుచ్చుకున్నాయి. ఆ త‌ర్వాత ఎగిరి ప‌డిన‌ప్పుడు న‌డుపై దెబ్బ త‌గిలింది. ఆ సినిమా త‌మిళంలో విడుద‌లై బాగా ఆడుతుంది. తెలుగులో ఏవ‌రేజ్ సినిమాగా పేరు తెచ్చుకుంది.
 
తాజాగా త‌మిళం, తెలుగు ద్విబాషా చిత్రం సెట్‌కు వెళ్ళింది. హైద‌రాబాద్‌లోని ఫిలింసిటీలోనే షూట్ చేస్తున్నారు. ముందుగా యాక్ష‌న్ సీన్ చేస్తుండ‌గా కాలి బెణికింది. అంత‌కుముందు న‌డుము ద‌గ్గ‌రున్న పెయిన్ మ‌ర‌లా పెరిగింది. ఆయ‌న‌కు రెస్ట్ కావాల‌ని డాక్ట‌ర్లు చెప్పిన‌ట్లు తెలిసింది. ఇటీవ‌లే సెహ‌రి సినిమా ప్రీరిలీజ్‌కు ఆయ‌న హాజ‌రు కావాల్సింది. విశాల్ హైద‌రాబాద్‌లో వుండ‌డంతో ఆయ‌న్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయ‌న వ‌స్తాన‌న్నారు. అయితే స‌రిగ్గా ఫంక్ష‌న్ జ‌రిగే నాడు ఆయ‌న రాలేక‌పోతున్న‌ట్లు సెహ‌రి హీరో హ‌ర్ష్ తెలియ‌జేశారు. విశాల్ గారు రావాల్సివుంది. కానీ ఆయ‌న‌కు బాగా ఇంజురీ అవ‌డంతో రాలేక‌పోయార‌ని తెలిపారు. సో.. హీరోలు యాక్ష‌న్ సీన్స్ చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వుండాలిసుమా..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments