'ఇండియన్-2'కు కష్టాల పరంపర... షూటింగ్ నిలిపివేతపై నిర్మాత ఆలోచన!?

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (13:52 IST)
శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ "ఇండియన్-2". గత 1996లో వచ్చిన 'భారతీయుడు' మూవీకి ఇది సీక్వెల్. ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. క‌మ‌ల్‌, కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
 
అయితే, ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అంతరాయం తగులుతూనే వుంది. 'ఇండియ‌న్ 2' చిత్ర షూటింగ్ మొద‌లైన‌ప్పుడు ఏవో కార‌ణాల వ‌ల‌న కొద్ది రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత క‌మ‌ల్ కాలు ఆప‌రేషన్ స‌మ‌యంలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రేన్ విరిగిపడి ఘోరమైన ప్రమాదం వాటిల్లి ప్రాణనష్టం జరిగింది. 
 
ఆ ప్రమాదం నుంచి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దాం అనుకునేలోపు కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిపివేయడం జరిగింది. ఇలా ప్ర‌తీసారి సినిమాకి అవాంత‌రాలు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈ ప్రాజెక్టును నిలిపివేస్త మంచిదన్న ఆలోచనలో నిర్మాత సుభాస్కరన్ ఉన్నట్టు కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

మొంథా తుఫాను- తెలంగాణలో భారీ వర్షాలు- పెరుగుతున్న రిజర్వాయర్ మట్టాలు- హై అలర్ట్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments