Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాశాల కోసం అడుక్కోలేదు... డిగ్నిటీగా బిహేవ్ చేస్తున్నా : ఇలియానా

గోవాబ్యూటీ ఇలియానా ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంది. ఇటు టాలీవుడ్‌లోను, అటు బాలీవుడ్‌లోనూ అవ‌కాశాలు లేక ట్విట్ట‌ర్‌తో కాల‌క్షేపం చేస్తోంది. బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్ట‌కుండా టాలీవుడ్‌లోనే కొన‌

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (09:31 IST)
గోవాబ్యూటీ ఇలియానా ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంది. ఇటు టాలీవుడ్‌లోను, అటు బాలీవుడ్‌లోనూ అవ‌కాశాలు లేక ట్విట్ట‌ర్‌తో కాల‌క్షేపం చేస్తోంది. బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్ట‌కుండా టాలీవుడ్‌లోనే కొన‌సాగితే, ఇప్పుడు ఇల్లీ బేబీ రేంజ్ ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో ఉండేది. ఎందుకంటే కోటి రూపాయ‌లు తీసుకున్న తొలి హీరోయిన్‌గా ఈ బ‌క్క ప‌ల‌చ‌ని భామ అప్ప‌ట్లో సంచలనం సృష్టించింది. అయితే ముంబైకి మకాం మార్చాక ఇక్క‌డ టాలీవుడ్‌లో హ‌వా కోల్పోయింది. పోనీ అక్క‌డైనా అవ‌కాశాలు వ‌స్తున్నాయా అంటే, అదీ లేదు. 
 
ముంబై వెళ్లిన తర్వాత ఈ గోవా బ్యూటీలో అంత స్పీడు కనిపించడం లేదు. అక్కడ జోరు తగ్గడానికి కారణం... హిందీ సినిమాల్లో అవకాశాలు రాక కాదట, వచ్చిన వాటిలో మంచివి ఎంపిక చేసుకోవడమే అంటున్నారు. అంతే కాదండోయ్.. అవకాశాల కోసం ఎవ్వర్నీ అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదని ఇలియానా తేల్చిచెప్తోంది. ఈ మధ్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు, అందులో ఆమె సెలక్షన్ పట్ల హ్యాపీగా ఉన్నారట. ''నా వరకూ నేను మంచి సినిమాలే సెలక్ట్ చేసుకున్నా. నా హార్డ్ వర్క్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెప్పగలను. ఇప్పటివరకూ ఎవర్నీ ఫేవర్ చేయమని అడగలేదు. అవకాశాల కోసం ఎవర్నీ అడుక్కోను. నా డిగ్నిటీ నాకుంది'' అంటోంది. 
 
ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో ఇలియానా నటిస్తున్నారు. దీంతో అప్ప‌డ‌ప్పుడూ బాయ్ ఫ్రెండ్‌తో, మేగ‌జైన్ ఫోటోషూట్ల‌తో, ట్విట్ట‌ర్ తోనూ కాలం వెళ్ళ‌దీస్తోంది. రీసెంట్‌గా ఇలియానా ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ ఒక‌రు ''ఇంట్లో ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు మీరు ఎలా ఉంటారు'' అని ఓ చిలిపి ప్ర‌శ్న అడిగాడు. అందుకు ఈ బ్యూటీ ఇచ్చిన సమాధానం చూస్తే దిమ్మదిరిగి పోవాల్సిందే. ఆ ప్ర‌శ్న‌కి ఏమాత్రం త‌డుముకోకుండా ''ఇంట్లో ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు టీవీ ఎదురుగా సోఫాలో కూర్చుని స్నాక్స్ తింటూ, న‌చ్చిన ప్రోగ్రామ్‌ని చూస్తూ ఎంజాయ్ చేయ‌డం ఇష్టం. అది కూడా కేవ‌లం అండ‌ర్ వేర్ ధ‌రించి'' అని రీట్వీట్ చేసింది ఇల్లీ. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments