Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాలను కెమెరాలో బాయ్‌ఫ్రెండ్ బంధిస్తుంటే.. ఎంజాయ్ చేస్తున్న గోవా బ్యూటీ

గోవా బ్యూటీ ఇలియానా బాగా హాట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా, ఎప్పుడూ ఏదో ఒక న్యూస్‌తో జనాల్లో తన ఉనికిని నిలబెట్టుకునే విద్యలో గోవా అందం ఇలియానా బాగా ముది

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (14:13 IST)
గోవా బ్యూటీ ఇలియానా బాగా హాట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా, ఎప్పుడూ ఏదో ఒక న్యూస్‌తో జనాల్లో తన ఉనికిని నిలబెట్టుకునే విద్యలో గోవా అందం ఇలియానా బాగా ముదిరిపోయింది. నాకు బీచ్‌లంటే మహా పిచ్చి అంటూ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చింది ఇలియానా. సోషల్ మీడియాలో మహా యాక్టివ్‌గా ఉండే ఈ బక్క భామ.. ఈ మధ్య తెగ ఫోటోలు షేర్ చేసేస్తోంది. 
 
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వరుసగా తన ఫోటోలను పెట్టేస్తూ.. నెటిజన్లకు మంచి కిక్ ఇస్తోంది. అమ్మడి నేచురల్ అందాలను కూడా బయటపెట్టేస్తూ ఈ మధ్య బోలెడన్ని ఫోటోలు బయటకొస్తున్నాయి. ఇందుకుకారణం ఆమె ఆస్ట్రేలియన్ లవర్ ఆండ్రూ నీబోన్. స్వతహాగా ఫోటోగ్రాఫర్ అయిన అండ్రూ.. తన ప్రేయసిలోని అందాలను ఫోటోలుగా మలిచి అభిమానులకు అందాల విందు అందించడం కోసం బోలెడంత కష్టపడుతున్నాడు. 
 
'ఫిల్టర్లు లేవు.. ఫోటోషాప్ లేదు.. ఎలాంటి బుల్షిట్ లేదు.. అదీ అండ్రూ ఫోటోల స్పెషాలిటీ' అంటూ ఓ పోస్ట్ కూడా పెట్టింది ఇల్లీ బేబి. ఈ గోవా బ్యూటీ అందాలను అండ్రూ ఆరాధిస్తూ.. కెమెరాలో బంధిస్తుంటే... వాటన్నింటినీ ఎంచక్కా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసి.. కనుల విందు చేసేస్తోంది ఇలియానా. 'నేనెప్పుడూ డోంట్ కేర్ అనే పద్ధతిలో ఉంటాను. నాకు తగ్గవాడే ఆండ్రూ కూడా. తనో అద్భుతమైన ఫోటోగ్రాఫర్. మిగతా ఫోటోగ్రాఫర్లు చూసినట్లు కాకుండా డిఫరెంట్‌గా నన్ను చూపిస్తాడు. మేకప్‌లో లేకుండా కూడా నన్ను ఎంతో అద్భుతంగా చూపించగలడు. 
 
తను నా శక్తి - ధైర్యం. నా సినిమాలను కూడా ఎంతో ప్రేమిస్తాడు.. ఇష్టపడతాడు' అంటున్న ఇలియానాకి.. మీరు నటించిన అన్ని సినిమాలు చూపిస్తారా అనే ప్రశ్న ఎదురైంది. 'నేను నా సినిమాల్లో మంచి వాటిని మాత్రమే చూపిస్తా' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం అజయ్ దేవగన్ మూవీ బాద్ షాహో లోను.. అర్జున్ కపూర్ మూవీ ముబారకన్‌లోనూ ఇల్లీ బేబి నటిస్తోంది. రీసెంట్‌గా అక్షయ్ కుమార్‌తో చేసిన రుస్తుం సక్సెస్ కావడం.. అమ్మడికి బాలీవుడ్‌లో మళ్లీ డిమాండ్ పెంచేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

సింగపూర్‌లో స్విమ్మింగ్-12 ఏళ్ల బాలికను వేధించాడు.. చిప్పకూడు తింటున్నాడు..

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments