Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్ ఖాన్‌తో కలిసి నటించాలనుంది.. కానీ ఆయన అలా అనుకోవాలి కదా?: సోనమ్ కపూర్

అప్పుడప్పుడూ ఘాటు స్టేట్‌మెంట్లతోనూ జనాల దృష్టిని తనవైపుకు తిప్పుకోంటుంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వారసులకు అవకాశాలు సులువుగా వచ్చేస్తాయని చాలామంది భావిస్తుంటారని, కానీ అ

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (12:10 IST)
అప్పుడప్పుడూ ఘాటు స్టేట్‌మెంట్లతోనూ జనాల దృష్టిని తనవైపుకు తిప్పుకోంటుంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వారసులకు అవకాశాలు సులువుగా వచ్చేస్తాయని చాలామంది భావిస్తుంటారని, కానీ అది తప్పని అంటోంది. నిజానికి తాను అనిల్ కపూర్ కుమార్తె కావడం వల్లే చాలా అవకాశాలు చేజారాయని నిట్టూరుస్తోంది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో నటించాలనే కోరిక తనకు ఎప్పటినుందో ఉందని తెలిపింది. అయితే, తనతో నటించాలనే ఉద్దేశం ఆయనకు ఉందని తాను భావించడం లేదని అంటోంది. "షారుఖ్‌తో కలసి నటించేందుకు నాకు చాలా అవకాశాలు వచ్చాయి.

నాకు కూడా ఆయనతో కలసి పని చేయాలనే కోరిక ఉంది. అయితే, నాతో కలిసి పనిచేయాలని ఆయన ఎప్పుడు అనుకుంటారో... అప్పుడే అది సాధ్యమవుతుందని తన మనసులోని మాటను బయటపెట్టింది. సినిమాలో ఏ హీరోయిన్‌తో కలిసి నటించాలి అనేది హీరోపైనే ఆధారపడియుంటుందని.... సినీ రంగంలో ప్రస్తుతం అదే జరుగుతోంది" అని తెలిపింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments