సంజయ్ గుప్తా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన తాజా చిత్రం 'కాబిల్'. ఈ చిత్రంలో హృతిక్ సరసన యామీ గౌతమ్ జతకట్టింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి 26న ప్రేక్
సంజయ్ గుప్తా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన తాజా చిత్రం 'కాబిల్'. ఈ చిత్రంలో హృతిక్ సరసన యామీ గౌతమ్ జతకట్టింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, ఈ చిత్రం విడుదలకు ముందే కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ కాబిల్ కాపీ కంటెంట్ అంటూ ఆరోపణలు చేసింది. మార్వెల్ కామిక్ క్యారెక్టర్ డేర్ డేవిల్‌ను కాబిల్‌లో కాపీ కొట్టారని.. యాక్షన్ సీన్స్ డేర్ డేవిల్‌ని అచ్చుగుద్దినట్టు తీశారని వాదిస్తోంది. పైగా కాబిల్ చిత్ర బృందంపై లీగల్ ఫిర్యాదు ఇవ్వబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు వెల్లడించారు.
మరోవైపు, 'కాబిల్' కాపీ కాదని చిత్ర యూనిట్ ఘంటాపథంగా చెపుతోంది. మరీ.. చివరికి ఈ కాపీ మరక ఎలా చెరిగిపోతుందో చూడాలి. ఇటీవలే రిలీజైన హృతిక్ మొహంజదారో ఘోరంగా నిరాశపరిచింది. 'కాబిల్'తోనైనా సత్తాచాటుదామని ఆశపడిన హృతిక్.. సినిమా రిలీజ్‌కి ముందే కష్టాలు మొదలైనట్టు కనబడుతోంది.