Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతపని చేసావు మామా.. రజనీపై పడి ఏడుస్తున్న ధనుష్: ఎందుకు?

నటుడు ధనుష్, శింబుల మధ్య వృత్తిరీత్యా గట్టి పోటీనే ఉందన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య దాదాపు మాటల్లేవనే చెప్పాలి. అలాంటిది తన మామ, ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ ఈ మధ్య శుభాకాంక్షలు చెప్పడం ధనుష్ కి ఏమాత్రం జీర్ణం కాలేదని తెలుస్తోంది.

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (08:58 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన మామకు సంబంధించి ఒక విషయంలో తీవ్రంగా మధనపడుతున్నట్లు సమాచారం. నటుడు ధనుష్, శింబుల మధ్య వృత్తిరీత్యా గట్టి పోటీనే ఉందన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య దాదాపు మాటల్లేవనే చెప్పాలి. అలాంటిది తన మామ, ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ ఈ మధ్య శుభాకాంక్షలు చెప్పడం ధనుష్ కి ఏమాత్రం జీర్ణం కాలేదని తెలుస్తోంది. కానీ అలాగని మామను ధిక్కరించి ఒక మాట అనలేడు. శింబుకు సొంత మామే అంత క్రెడిట్ ఇవ్వడం సహించలేడు. ఏమనలేక, అలాగని చెప్పి తన బాధను దాచుకోలేక ధనుష్ మల్లగుల్లాలు పడుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో తన భార్య ఐశ్వర్య మరో పిచ్చి కోరిక కోరడం ధనుష్‌ని ఇంకా కలవరపెడుతోంది. ఐశ్వర్య ధనుష్‌ 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన విషయం తెలి సిందే. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా అంతకంటే ఎక్కువే ప్రాచుర్యాన్ని అందించింది. ఆ తరువాత దర్శకత్వం వహించిన ఐ రాజా వై చిత్రం కూడా అంతంత మాత్రంగానే ఆడింది. అయినా మంచి విజయం కోసం ఐశ్వర్యధనుష్‌ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
 
దీంట్లో భాగంగా ఆమెకు శింబు కథానాయకుడిగా ఒక చిత్రం చేయాలన్న కోరిక ఉందని సమాచారం. దానికి సంబంధించి ఇప్పటికే కథ రెడీ చేసుకున్నప్పటికీ తన భర్త  ధనుష్‌ని ధిక్కరించి శింబుతో చిత్రం చేయగలనా అనే ఫీలింగులో ఉందామె. అసలు ఈ విషయాన్ని ధనుష్‌కు ఎలా చెప్పాలన్న సంశయంతో ఐశ్వర్య కొట్టుమిట్టాడుతున్నారు. తమ ఇద్దరి మధ్య సంబంధాలు ఏమాత్రం లేని నేపథ్యంలో తన భార్య శింబుతో సినిమా చేస్తుందని తెలిస్తే ధనుష్ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవలసింది. మామా, కూతురు ఇద్దరు కలిసి ధనుష్‌కి షాక్ తెప్పించేటట్లే ఉన్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గాజువాక చిరు వ్యాపారుల సిగపట్టు... అడ్డుకోబోయిన వ్యక్తికి దాడి (video)

ఆర్టీసీ బస్సులో వృద్ధులకు రాయితీ.. మార్గదర్శకాలు ఇవే

తెలంగాణలోని 457 అంగన్‌వాడీలలో రిలయన్స్ ఫౌండేషన్ ‘కహానీ కళా ఖుషీ’ ప్రచారం

కత్తితో పొడిచి మందుబాబు పరార్.. వీపులో కత్తి నాటుకుపోయింది.... (video)

ప్రస్తుత ఇసుక విధానం ఏమీ బాగోలేదు: కూటమి ప్రభుత్వానికి జ్యోతుల నెహ్రూ షాక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments