Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్‌లో నాకంత అనుభవం లేదు.. ఆర్యన్ గర్ల్‌ఫ్రెండ్‌ గురించి నాకేం తెలుసు : షారూక్ ఖాన్

బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు షారుక్‌ ఖాన్‌ పెద్ద కుమారుడు ఆర్యన్‌ అమ్మాయిలతో ఉన్న ఫొటోలు ఇటీవల బాలీవుడ్‌లో హాల్‌చల్ సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఆర్యన్‌ గర్

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (15:54 IST)
బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు షారుక్‌ ఖాన్‌ పెద్ద కుమారుడు ఆర్యన్‌ అమ్మాయిలతో ఉన్న ఫొటోలు ఇటీవల బాలీవుడ్‌లో హాల్‌చల్ సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఆర్యన్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు షారుక్‌ కూల్‌గా సమాధానం ఇచ్చారు. 
 
కింగ్ ఖాన్ షారుక్‌ ఎప్పటిలాగే తన అభిమానులతో కలిసి కొంతసేపు ట్విట్టర్‌ వేదికగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకి షారుక్‌ తనదైన శైలిలో బదులిచ్చారు. ఆ సందర్భంగా ఓ అభిమాని ''షారుక్‌.. మీకు ఆర్యన్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌ గురించి తెలుసా?'' అని ప్రశ్నించాడు. దీనికి షారుక్‌ ఏ మాత్రం తడుముకోకుండా కూల్‌గా సమాధానం ఇచ్చారు. ''మేము మా గర్ల్‌ఫ్రెండ్స్‌(విషయాలను)ని మా వరకే ఉంచుకుంటాం!'' అని ట్వీట్‌ చేశారు.
 
కుమారుడు ఆర్యన్ ఖాన్ గాళ్ ఫ్రెండ్స్ వివరాలు చెప్పమంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు 'చెప్పను' అనే అర్థం స్ఫురించేలా తనదైనశైలిలో స్పందించాడు. అంతేకాదు డేటింగ్ పైనా ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు, అలాంటి విషయాల్లో నాకంత అనుభవం లేదంటూ కింగ్ ఖాన్ బదులిచ్చాడు. అమ్మాయిల విషయంలో నేను కాస్త బలహీనుణ్ణి అంటూ కామెంట్ చేశాడు. అభిమానుల ప్రశ్నలకు బాలీవుడ్ బాద్షా హ్యూమరస్‌గా స్పందించడం అందరినీ ఆకట్టుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments